AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2: బాహుబలి 2 రికార్డులను కేజీఎఫ్‌ 2 తిరగరాస్తుందా.? యశ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..

KGF 2: కేజీఎఫ్‌ తొలి పార్ట్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కేజీఎఫ్‌2 సినిమా కోసం మూవీ లవర్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ 14, గురువారం దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు...

KGF 2: బాహుబలి 2 రికార్డులను కేజీఎఫ్‌ 2 తిరగరాస్తుందా.? యశ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..
Kgf 2
Narender Vaitla
|

Updated on: Apr 11, 2022 | 5:39 PM

Share

KGF 2: కేజీఎఫ్‌ తొలి పార్ట్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కేజీఎఫ్‌2 సినిమా కోసం మూవీ లవర్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ 14, గురువారం దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి పార్ట్‌ అనూహ్య రీతిలో భారీ విజయాన్ని అందుకోవడంతో, సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. గోల్డ్‌ మైనింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సైలెంట్‌గా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. తెలుగులోనూ నేరుగా హీరో, దర్శకులు పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఆదివారం చిత్ర యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. మీడియా సమావేశంలో పాల్గొన్న హీరో యశ్‌ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘తిరుపతి పుణ్య క్షేత్రానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్న ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటక, ఆంధ్రాల మధ్య అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. కన్నడవాళ్లు తెలుగు కూడా చదవగలరని. తమను తెలుగు ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తారని అస్సలు ఊహించలేదు అంటూ ఆడియన్స్‌కు యశ్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఇక ‘బాహుబలి-2’ కలెక్షన్స్‌ని ‘కేజీఎఫ్‌-2’ బీట్‌ చేస్తుందా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందించిన యశ్‌.. ‘అలా చేస్తే మంచిదే కదా. ఒక సినిమా క్రియేట్‌ చేసిన రికార్డ్స్‌ దాని తర్వాత వచ్చే చిత్రాలు బ్రేక్‌ చేయాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. అలా జరిగితేనే ప్రోగ్రెస్‌ ఉంటుంది. రికార్డ్స్‌ కూడా ఇంఫ్రూవ్‌ అవుతూ ఉంటాయి’ అని చెప్పుకొచ్చారు. ఇక బీస్ట్‌ వర్సెస్‌ కేజీఎఫ్‌ అంశంపై మీరేలా స్పందిస్తారన్న ప్రశ్నకు.. పుణ్యక్షేత్రంలో ఉన్నాం. అందరికీ విజయమే రావాలని కోరుకుందాం అని బదులిచ్చారు.

Also Read: TRS Dharna: ఢిల్లీలో ‘వరి’పై గళమెత్తిన టీఆర్ఎస్.. ప్రత్యేక ఆకర్షణగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

AP New Cabinet: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం.. టార్గెట్ 2024 లైవ్ వీడియో

Crime news: సతీసహగమనానికి రివర్స్ సీన్.. భార్య చితిలో దూకిన భర్త.. అసలు కారణమేంటంటే