Bloody Mary: ‘ప్రతి ఒక్కరిలోనూ మ‌న‌కు తెలియ‌ని మ‌రో మ‌నిషి ఉంటాడు’.. ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘బ్లడీ మేరీ’ ట్రైలర్‌..

Bloody Mary Trailer: ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్‌ను పరిచయం చేస్తూ దూసుకుపోతోంది తొలి తెలుగు ఓటీటీ ఆహ (Aha). టాక్‌ షోలు, మ్యూజిక్‌ షోలు, ఒరిజినల్స్‌తో ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా..

Bloody Mary: ‘ప్రతి ఒక్కరిలోనూ మ‌న‌కు తెలియ‌ని మ‌రో మ‌నిషి ఉంటాడు'.. ఆసక్తిరేకెత్తిస్తోన్న 'బ్లడీ మేరీ' ట్రైలర్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 11, 2022 | 3:51 PM

Bloody Mary Trailer: ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్‌ను పరిచయం చేస్తూ దూసుకుపోతోంది తొలి తెలుగు ఓటీటీ ఆహ (Aha). టాక్‌ షోలు, మ్యూజిక్‌ షోలు, ఒరిజినల్స్‌తో ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఒరిజినల్‌తో రాబోతోంది. నివేథా పేతురాజ్‌ (nivetha pethuraj) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘కార్తికేయ’ ఫేమ్‌ చందూ ముండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా వర్క్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఆహా ఓటీటీలో ఏప్రిల్‌ 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలోనే సినిమా విడుదల తేదీ దగ్గరపడ్డ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

1.23 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. గ్రిప్పింగ్‌ కథాంశంతో కార్తికేయ సినిమాతో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసిన చందూ ముండేటి ఈ సినిమాను కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ కథాంశతోనే తెరకెక్కినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో వచ్చే ‘ప్రతి ఒక్కరిలోనూ మ‌న‌కు తెలియ‌ని మ‌రో మ‌నిషి ఉంటాడు. అవ‌సరం అవ‌కాశాన్ని బ‌ట్టి ఆ మ‌నిషి బ‌య‌ట‌కు వ‌స్తాడు. మ్యాట‌రేంటంటే ఆ బ‌య‌ట‌కొచ్చిన మ‌నిషే ఒరిజిన‌ల్’ అంటూ అజ‌య్ చెప్పే సంభాష‌ణ‌లు డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

ఇక నివేథ చెప్పే.. ‘కాలానికి విప‌రీత‌మైన మొమోరి ప‌వ‌ర్ ఉంటుంది. ఏ స‌న్నివేశాన్ని మ‌ర్చిపోదు. క‌ర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది.. వ‌డ్డితో స‌హా’ డైలాగ్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. మొత్తంగా ట్రైలర్‌ను గమనిస్తే ఆహా నుంచి మరో ఆసక్తికరమైన సినిమా ఆడియన్స్‌ను మెప్పించడానికి వచ్చేస్తుందన్న విషయం అర్థమవుతోంది. ఆసక్తిని రేకేత్తిస్తోన్న ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Dry Fruits: ఎండాకాలంలో డ్రైఫూట్స్‌ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

Summer Fruits: వేసవిలో ఈ 6 పండ్లను తప్పక తీసుకోవాల్సిందే.. బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలు..

India Gold Imports: పసిడి దిగుమతిలో భారత్‌ 2వ స్థానం.. భారీగా పెరిగిన బంగారం దిగుమతులు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే