AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fruits: ఎండాకాలంలో డ్రైఫూట్స్‌ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

Dry Fruits in Summer: వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. దీంతోపాటు శరీరాన్ని చల్లగా ఉంచే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మన శరీరం చల్లబడుతుంది.

Dry Fruits: ఎండాకాలంలో డ్రైఫూట్స్‌ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
Badam
Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2022 | 1:35 PM

Share

Dry Fruits in Summer: వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. దీంతోపాటు శరీరాన్ని చల్లగా ఉంచే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మన శరీరం చల్లబడుతుంది. అయితే.. ఈ సీజన్‌లో డ్రై ఫ్రూట్స్‌ వినియోగం తగ్గుతుంది. నిజానికి డ్రై ఫ్రూట్స్‌లో చాలా వరకు వేడి చేసే స్వభావం ఉంటుంది. అయితే వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావున వేసవిలో కూడా తినవచ్చు. అయితే.. వీటిని నానబెట్టి మాత్రమే తినాలని సూచిస్తున్నారు. సాధారణంగా తినడానికి ఇదే ఉత్తమ మార్గం అని పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల వాటి వేడి అంతా ఆవిరైపోతుంది. దీనితో పాటు వాటిని జీర్ణం చేయడం కూడా చాలా సులభం అవుతుంది. వేసవిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఎలాంటివి తినాలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండుద్రాక్ష – బాదం: బాదం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌ని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం వాటిని తినండి. వాటిని నీటిలో నానబెట్టడం వల్ల వాటి వేడి అంతా తొలగిపోతుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం మెదడుకు మేలు చేస్తుంది. వాల్ నట్ మలబద్ధకం, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది. వాల్‌నట్స్‌లో ఐరన్, కాల్షియం, కాపర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. వేసవిలో వీటిని ఎక్కువగా తీసుకోవడం మానుకోండి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు.. ఎండుద్రాక్ష బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. వేసవిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినండి. ఇది చాలావరకు వేడిని దూరం చేస్తుంది.

చియా విత్తనాలు: వేసవిలో చియా విత్తనాలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి చల్లదనాన్ని ఇస్తాయి. మీరు వీటిని తినాలనుకుంటే ఒక చెంచా చియా గింజలను నీటిలో నానబెట్టండి. తరువాత వాటిని ఫలూడా, ఐస్ క్రీం, షర్బత్ వంటి డెజర్ట్‌లలో కలపి తింటే ఇంకా బాగుంటుంది.

అత్తి పండ్లు: అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వీటిని తినాలి. ఇవి రక్త హీనతను తొలగించి.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని జింక్, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి పని చేస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణక్రియ పెరుగుతుంది.

ఎండుద్రాక్ష: ఎండుద్రాక్షలో ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. వేసవిలో నానబెట్టి మాత్రమే తినాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

(ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం సూచనలు మాత్రమే. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)

Also Read:

Viral: 24 గంటలు క్రైమ్ డాక్యుమెంటరీలు చూస్తే 1.8 లక్షల జీతం.. ఎవరికి అవకాశమంటే!

Rakesh Tikait: కేంద్రం తీరుతో రైతులు మరణిస్తూనే ఉండాలా..? టీఆర్ఎస్ దీక్షలో బీకేయూ నేత టికాయత్..