Pranitha Subhash: భర్త పుట్టినరోజున శుభవార్త షేర్ చేసుకున్న హీరోయిన్ ప్రణీత.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..
టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు..
టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే వ్యాపరవేత్త నితిన్ రాజును గతేడాది 30న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రణీత… సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సమాజంలో నెలకొన్న పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తూ.. కుటుంబ విషయాలను షేర్ చేసుకుంటుంది ప్రణీత.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా శుభవార్తను షేర్ చేసుకుంది.
త్వరలోనే తాను తల్లిని కానున్నట్లు తెలుపుతూ తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ” నా భర్త 34వ పుట్టినరోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు.” తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది. ప్రణీత పెట్టిన పోస్ట్ పై సినీ ప్రముఖులు, అభిమానులు స్పందిస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: Kalavathi Song: కళావతి పాటకు హీరోయిన్ లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Deepika Padukone: ఏడో తరగతిలోనే తొలిసారి కవిత రాసాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..
RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు