RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు
పాన్ ఇండియా సినిమా అనే మాటకు కరెక్ట్ డెఫినిషన్ ఏమైనా వుందా? దానికుండాల్సిన క్వాలిటీలు, క్వాలిఫికేషన్లు ఏంటి.. అనేది నిన్నటిదాకా ఒక అంతుబట్టని ప్రశ్న.
పాన్ ఇండియా సినిమా అనే మాటకు కరెక్ట్ డెఫినిషన్ ఏమైనా వుందా? దానికుండాల్సిన క్వాలిటీలు, క్వాలిఫికేషన్లు ఏంటి.. అనేది నిన్నటిదాకా ఒక అంతుబట్టని ప్రశ్న. బట్.. నో మోర్ కన్‌ఫ్యూజన్ అంటూ కొలీగ్స్‌కి పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు జక్కన్న(S. S. Rajamouli). ఆయనిచ్చిన ఒక ఫార్ములాను ఇప్పుడు మిగతా అందరూ బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారు. పర్‌ఫెక్ట్ సింక్రనైజేషన్‌తో ఇద్దరు హీరోలు కలిసి వేసిన ఆ హుక్ స్టెప్ నాటునాటు పాటను క్రేజీగా మారిస్తే.. ఆ క్రేజీ పాట ట్రిపులార్ సినిమాకు మెయిన్ డ్రైవింగ్‌ఫోర్స్‌గా పనిచేసి.. సినిమా లవర్స్ అందరినీ ఫాలోయర్లుగా మార్చేసుకుంది. ట్రిపులార్(RRR)లో మిగతా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఒక ఎత్తయితే.. తారక్ అండ్ చెర్రీ డ్యాన్సింగ్ టాలెంట్ ఒక్కటీ ఒక ఎత్తనేది నేషనల్ టాక్.
స్వతహాగానే సౌతిండియన్ స్టార్స్ అంటే మంచి డ్యాన్సర్స్ అనే పేరుంది. తెలుగు హీరోలైతే ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేశారు. నాటునాటు పాట ఆ స్టేట్‌మెంట్‌ని ఇంకాస్త సాలిడ్‌గా మార్చేసింది. సరిగ్గా ఇక్కడే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సీరియస్‌గా కనెక్టయ్యారట. పుష్ప ఫస్ట్ పార్ట్‌లో మిస్సయిన స్టయిలిష్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ని సెకండ్ పార్ట్‌లో చూడబోతున్నామన్నది లేటెస్ట్ ఖబర్. మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్‌పీతో ఒక ఫాస్ట్ బీట్ డిజైన్ చేయించుకుని.. స్టోరీలో ఆ పాటకు తగ్గ స్పేస్ కల్పించి.. ఫోర్స్‌గానైనా ఇంక్లూడ్ చేసే ప్రయత్నాల్లో వున్నారట కెప్టెన్ సుకుమార్. సో.. పుష్ప రూలింగ్‌లో బన్నీ నుంచి ఒక ఫాంటసీ పాటను ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చన్నమాట. జక్కన్న చూపిన దారిలో ఐకాన్ స్టార్ మాత్రమే కాదు.. మెగాస్టార్ కూడా నడవాలనుకుంటున్నారు. గాడ్‌ఫాదర్ మూవీలో కెమియో రోల్ చేస్తున్న సల్మాన్‌ఖాన్‌తో కలిసి స్టెప్పులెయ్యడానికి రెడీ అవుతున్నారు చిరూ. ఇప్పటికే సల్మాన్ ఖాన్ యాక్షన్ పార్ట్ పూర్తయింది. నాటునాటు తరహా స్పెషల్ సాంగ్ కోసం కొత్తగా మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ మోహన్‌రాజా. నార్త్‌లో కూడా మెగాసినిమాకు క్రేజ్ పెరగాలంటే.. ఇది ఒక షార్ట్ కట్ అన్నమాట. సో.. చిరూ అండ్ సల్లూ త్వరలో నాటునాటు స్టయిల్‌లో కంబైన్డ్ ప్రాక్టీస్ షురూ చేస్తారేమో!
మరిన్ని ఇక్కడ చదవండి :