Ram Charan: ఆ తమిళ హీరోలను మెగాపవర్ స్టార్ ఫాలో అవుతున్నాడా..? క్రిటిక్స్ ఏమంటున్నారంటే

మాస్‌ మసాలా చిత్రాలు మాత్రమే చేస్తా అంటూ గిరి గీసుకుని కూర్చునే టాలీవుడ్‌ హీరోలు కాస్త అటూ ఇటూ గా మారుతున్నారు. మాస్‌ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటూనే తమలోని మరో యాంగిల్ ను..

Ram Charan: ఆ తమిళ హీరోలను మెగాపవర్ స్టార్ ఫాలో అవుతున్నాడా..? క్రిటిక్స్ ఏమంటున్నారంటే
Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 10, 2022 | 7:24 PM

మాస్‌ మసాలా చిత్రాలు మాత్రమే చేస్తా అంటూ గిరి గీసుకుని కూర్చునే టాలీవుడ్‌ హీరోలు కాస్త అటూ ఇటూ గా మారుతున్నారు. మాస్‌ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటూనే తమలోని మరో యాంగిల్ ను తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ట్రీలో టాప్ పొజీషక్‌కు డైరెక్టర్ నిచ్చెనేస్తున్నారు. అయితే ఇలాంటి హీరోల్లో ముందున్నాడు మన మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్(Ram Charan). కెరీర్‌ ఇనీసియల్ స్టేజ్‌ లో కోర్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ.. మెగా ఫ్యాన్స్లో ఇమేజ్‌ క్రియట్‌ చేసుకోవాలని ట్రై చేసిన చెర్రీ.. ఉన్నట్టుండి కాస్త డిఫరెంట్‌ గా సినిమాలు చేయడం మొదలెట్టారు. గెటప్ ను మార్చుతూనో.. బాడీలో వేరియేన్ చూపిస్తూనో.. నటనలో నాణ్యత పెంచుకుంటూనో.. ఏదో చేస్తున్నాడు.. చేయబోతున్నాడనే ఫీల్ ను టూ స్టేట్ష్‌ ఫిల్మీ లవర్స్‌కు కలిగించారు.

కలిగించడమే కాదు.. తన ప్రయత్నాన్ని రంగస్థలం సినిమాతో నిజం చేశాడు. చిట్టిబాబు క్యారెక్టర్ తో అందర్నీ మెస్మరైజ్‌ చేశాడు. ఇక ఆ సినిమా తరువాత వచ్చిన ట్రిపుల్ ఆర్ లోనూ అదే కంటిన్యూ చేసి.. అల్లూరిగా తన దైన భావోద్వేగాలను పండించారు చెర్రీ. ఇక రాబోతున్న మెగాస్టార్ ఆచార్య సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడు. అలాగే రీసెంట్ గా చరణ్ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో పల్లెటూరి కుర్రాడిలా సైకిల్ తొక్కుతూ కనిపించాడు చరణ్. అయితే ఇదే.. గమనించిన కొంతమంది ఫిల్మీ క్రిటిక్స్ చెర్రీ తమిళ హీరోలు సూర్య, ధనుష్ ను ఫాలో అవుతున్నాడనే టాక్ ను బయటికి వదిలారు. ఈ తంబీల సక్సెస్ ఫార్ములానే చెర్రీ గ్రాబ్ చేసి మరీ ఎక్సిక్యూట్ చేస్తున్నాడని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :