Viral Photo: ఈ చిన్నారి గాత్రానికి దేశమే ఫిదా.. వేల పాటలతో మంత్రముగ్దులను చేస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..

ఆమె ఓ గాన కోకిల.. అద్భుతమైన గాత్రం తన సొంతం.. గొంతులో వేల భావాలను పలికిస్తోంది. తన గాత్రంతో ప్రేమను.. విరహాన్ని

Viral Photo: ఈ చిన్నారి గాత్రానికి దేశమే ఫిదా.. వేల పాటలతో మంత్రముగ్దులను చేస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..
Actress Childhood
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2022 | 1:17 PM

ఆమె ఓ గాన కోకిల.. అద్భుతమైన గాత్రం తన సొంతం.. గొంతులో వేల భావాలను పలికిస్తోంది. తన గాత్రంతో ప్రేమను.. విరహాన్ని.. దుఃఖాన్ని.. సంతోషాన్ని శ్రోతల మనసుల్లోని భావాలను వ్యక్తపరుస్తుంది. భాషతో సంబంధం లేకుండా.. దేశంలోని అన్ని భాషల్లో ఎన్నో అద్బుతమైన పాటలను పాడుతూ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది. అర్థం కానీ భాషలో సైతం భావాలను అందంగా తెలియజేస్తూ శ్రోతల మనసులను తట్టిలేపుతుంది. అమ్మ పొత్తిళ్లలోని చిన్నారికీ.. అమ్మాయి ప్రేమలో తేలుతున్న అబ్బాయికీ.. పిల్లల కోసం తాపత్రాయపడే తల్లిదండ్రుల భావాలు ఆమె పాడే పాటలే. ఆమె గాత్రానికి దేశమే ఫిదా. గుర్తుపట్టండి ఎవరో..

నువ్వేం మాయ చేశావో అంటూ అమ్మాయిల మనసులను.. కోపమా నాపైనా అంటూ అల్లరి చేష్టలను.. నీకోసం.. నీకోసం అంటూ ప్రేమను తెలియజేసినా.. ప్రేమించే ప్రేమవా అంటూ ప్రేమను ఉప్పోంగించడం.. అనుకోలేదేనాడు ఈలోకం అంటూ ప్రతి పాటలోని భావాలకు తన గొంతుతో ప్రాణం పోస్తుంది. గుర్తుపట్టారనుకుంటా.. ఆ చిన్నారి మరెవరో కాదు.. ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్.

శ్రేయా ఘోషల్ మార్చి 12, 1984లో పశ్చిమ బెంగాల్‏లోని దుర్గాపూర్ లో జన్మించింది. ఆమె తల్లి సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యువేట్ పూర్తి చేసింది. నాలుగేళ్ల వయసు నుంచే శ్రేయా ఘోషల్ తన తల్లివద్దనే హర్మోనియం నేర్చుకుంది. ఆ తర్వాత సంగీతం నేర్చుకుని 12 ఏళ్ళ వయసులోనే సరిగమప షోలో పాల్గొని విజేతగా నిలిచింది. ఇప్పటివరకు శ్రేయా.. 20కు పైగా భాషల్లో 2400లకు పైగా పాటలు పాడింది. మహేష్ బాబు, భూమిక నటించిన ఒక్కడు సినిమాలోని నువ్వేం మాయ చేశావో గానీ.. పాటతో శ్రేయా ఘోషల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇప్పటివరకు శ్రేయా ఘోషల్ హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ పాటలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది. తెలుగులో శ్రీరామ రాజ్యం సినిమాలో ఆమె పాడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

Also Read: NTR Jr.-Koratala Shiva: తారక్ సినిమాపై క్రేజీ అప్డేట్.. కొరటాల.. ఎన్టీఆర్ మూవీ డేట్ ఫిక్స్ ?..

Viral Photo: ప్రకృతి అందాల నడుమ అందాల రాశి.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

Pakka Commercial: ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. పక్కా కమర్షియల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..