Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ ముద్దుగుమ్మకు

Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..
Malaika
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2022 | 7:49 AM

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల ముంబై.. పూణే ఎక్స్‏ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలైకా తృటిలో ప్రాణాలతో బయటపడింది. గత శనివారం ఆమె పూణెలో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదానికి గురయ్యింది. ఆ ప్రమాదంలో మలైకాకు చిన్న చిన్న గాయాలయ్యాయి. దీంతో ఆమెకు హస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆమె కోలుకొని డిశార్జ్ అయ్యారు. ఈ క్రమంలో తనక సాయం చేసిన వైద్యులకు, సిబ్బందికి, స్నేహితులకు, కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మలైకా.

“గత కొద్ది రోజుల క్రితం జరిగిన సంఘటనలు ఇంకా నమ్మశక్యం కానివిగా ఉన్నాయి. నాకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తే.. అదేదో సినిమాలోని సన్నివేశంగా అనిపిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే నాకు సాయం చేసిన చాలా మంది నాకు దేవదూతలకు అనిపించారు. ఈ క్లిష్ట సమయంలో నాకు నా కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆసుపత్రి సిబ్బంది నాకు అండగా ఉన్నారు. ప్రతిక్షణం వైద్యులు నాకు భరోసా ఇచ్చారు. నన్ను సురక్షితంగా చూసుకున్నారు. నా మీద ప్రేమ చూపించిన నా స్నేహితులు, కుటుంబసభ్యులు, వైద్యులకు కృతజ్ఞతలు ” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది మలైకా.. ప్రస్తుతం నాకు కొత్త ఉత్సాహంతో కోలుకుంటున్నాను.. తనకు సాయం చేసిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తెలిపింది.

గత శనివారం మలైకా కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆమె అభిమానులందరూ షాకయ్యారు. పూణెలో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ముంబై, పూణే హైవేపై మలైకా కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మలైకాకు స్వల్ప గాయాలయ్యాయి.

Also Read: Beast: మోతమోగిపోతున్న విజయ్ స్టిల్స్.. వైరల్ అవుతున్న బీస్ట్ మూవీ పోస్టర్స్..

Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి పవర్‌ ప్యాక్డ్‌ సర్‌ప్రైజ్‌.. అదిరిపోయిన యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్ వీడియో..

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆచార్య ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..

Dil Raju: పూజా మన కాజా.. ఆమె అడుగుపెడితే.. బుట్టబొమ్మను ఆకాశానికెత్తేసిన దిల్‌రాజు..