AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonam Kapoor: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ.. కోట్ల రూపాయాలు.. నగలు దొంగతనం..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ (Sonam Kapoor) ఇంట్లో భారీ చోరీ జరిగింది. న్యూఢిల్లీలోని సోనమ్ కపూర్ ఇంట్లో దాదాపు రూ.2.40 కోట్ల నగదు.

Sonam Kapoor: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ.. కోట్ల రూపాయాలు.. నగలు దొంగతనం..
Sonam Kapoor
Rajitha Chanti
|

Updated on: Apr 10, 2022 | 6:45 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ (Sonam Kapoor) ఇంట్లో భారీ చోరీ జరిగింది. న్యూఢిల్లీలోని సోనమ్ కపూర్ ఇంట్లో దాదాపు రూ.2.40 కోట్ల నగదు.. నగలు చోరీకి గురైనట్లు సోనమ్ కపూర్ అత్తమామలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజా తల్లిదండ్రులు హారీష్ అహుజా, ప్రియా అహుజా ఢిల్లీలోని లుటియన్స్‏లోని అమృత షెర్గిల్ మార్గ్‏లోని ఇంట్లో నివసిస్తున్నారు. ఫిబ్రవరిలో వారింట్లో దొంగతనం జరిగిందని.. దీంతో వారు వెంటనే.. ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాదాపు రూ.2.40 కోట్లు విలువైన నగదు.. విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కోన్నారు. దీంతో ఐపీసీ సెక్షన్ 381కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా పోలీసులు తెలిపారు.

ఈ కేసును ప్రత్యేక సిబ్బంది న్యూ్ఢిల్లీకి బదిలీ చేశామని.. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని.. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. సోనమ్ ఇంట్లో పనిచేస్తోన్న 25 మంది ఉద్యోగులు… 9 మంది కేర్ టేకర్స్, డ్రైవర్స్ ఇతర పనివాళ్లను పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం సోనమ్.. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్‏లో ఉంటుంది. ఇటీవలే ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్. భన్సాలీ దర్శకత్వంలో సావరియా సినిమాతో హీరోయిన్‏గా పరిచయమైన సోనమ్.. రాంఝణా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Also Read: Beast: మోతమోగిపోతున్న విజయ్ స్టిల్స్.. వైరల్ అవుతున్న బీస్ట్ మూవీ పోస్టర్స్..

Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి పవర్‌ ప్యాక్డ్‌ సర్‌ప్రైజ్‌.. అదిరిపోయిన యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్ వీడియో..

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆచార్య ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..

Dil Raju: పూజా మన కాజా.. ఆమె అడుగుపెడితే.. బుట్టబొమ్మను ఆకాశానికెత్తేసిన దిల్‌రాజు..