AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆచార్య ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..

Acharya Trailer: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan) కూడా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆచార్య ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..
Acharya
Basha Shek
|

Updated on: Apr 09, 2022 | 6:11 PM

Share

Acharya Trailer: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan) కూడా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరు సరసన కాజల్‌, చెర్రీ సరసన పూజాహెగ్డే సందడి చేయనున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఏప్రిల్ 29న ఆచార్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్లు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ డోస్‌ మరింత పెంచేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఇందులో భాగంగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసింది. ఏప్రిల్ 12న ఆచార్య ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో కొరటాల శివ ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రెజీనా ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే తేదీని, వేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఏప్రిల్ 24న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ మైదానంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు అతిథులుగా రావొచ్చనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Also Read: RR vs LSG IPL 2022 Match Preview: రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన లక్నో.. ఇరుజట్ల బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Hyderabad: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్.. పూర్తి వివరాలివే..

Viral News: తీవ్రగాయాలతో తల్లడిల్లుతున్న వృద్ధుడు.. చేతుల్లోకి తీసుకుని పరుగులు తీసిన ఇన్స్‌పెక్టర్..!