Hyderabad: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్.. పూర్తి వివరాలివే..

శ్రీరామ‌న‌వమి(Sri Ramanavami Festival) పర్వదినం సంద‌ర్భంగా మ‌ద్యం అమ్మకాల‌పై నిషేధం విధిస్తూ పోలీసులు నిర్ణయించారు. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు...

Hyderabad: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్.. పూర్తి వివరాలివే..
wines
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 09, 2022 | 6:21 PM

శ్రీరామ‌న‌వమి(Sri Ramanavami Festival) పర్వదినం సంద‌ర్భంగా మ‌ద్యం అమ్మకాల‌పై నిషేధం విధిస్తూ పోలీసులు నిర్ణయించారు. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు హైద‌రాబాద్‌(Hyderabad)లో మ‌ద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి, మ‌ద్యం విక్రయించే వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. ప్రజలు గమనించి, పోలీసులకు సహకరించాలని కోరారు. పర్వదినాలు, పండగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జగరకుండా మద్యం దుకాణాలు మూసివేయిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. శ్రీరామనవవి సందర్భంగా హైదరాబాద్, భైంసా(Bhainsa)లో నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసుల మార్గదర్శకాల మేరకే శోభాయాత్ర నిర్వహించాలని వెల్లడించింది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే జరపాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర నిర్వహించుకోవచ్చునని హైకోర్టు పేర్కొంది.

భైంసాలో రేపు జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణమంతా బలగాలను మోహరించారు. భారీ భద్రతతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. శాంతియుత వాతావరణంలో శోభాయాత్రను నిర్వహించుకోవాలని ఏఎస్పీ కిరణ్ కారే పిలుపునిచ్చారు. హైకోర్టు షరతులను పాటించాలని నిర్వాహకులకు సూచించారు.

Also Read

Ghani Movie: అప్పుడే ఓటీటీలోకి మెగా ప్రిన్స్‌ గని!.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Human Bodies Frozen: ఎన్నేళ్లయినా చెక్కుచెదరదు.. ఫుల్ బాడీకి ఒకరేటు.. అవయవాలైతే ఇంకోరేటు.. ఎక్కడంటే?

Cloves Water Benefits: లవంగాల నీరు తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? ఆ సమస్యలకు విరుగుడు మందు ఇదే..