Human Bodies Frozen: ఎన్నేళ్లయినా చెక్కుచెదరదు.. ఫుల్ బాడీకి ఒకరేటు.. అవయవాలైతే ఇంకోరేటు.. ఎక్కడంటే?
Human Bodies Frozen: ఎవరైనా చనిపోతే.. ఒకటి లేదా రెండు రోజుల్లో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి వారం లేదా 10 రోజుల వరకు డెడ్ బాడీని ఉంచుతారు. కానీ ఇక్కడ మాత్రం

Human Bodies Frozen: ఎవరైనా చనిపోతే.. ఒకటి లేదా రెండు రోజుల్లో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి వారం లేదా 10 రోజుల వరకు డెడ్ బాడీని ఉంచుతారు. కానీ ఇక్కడ మాత్రం దీర్ఘకాలం డెడ్ బాడీని భద్రపరుస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా..? ఎప్పుడైనా ప్రపంచ ఆధునిక వైద్యశాస్త్రం చనిపోయిన వారిని బతికించేలా వృద్ధి చెందితే.. కాపాడుకోవచ్చన్న ఉద్దేశ్యంతో ఇక్కడ డెడ్ బాడీలను భద్రపరుస్తున్నారు. దీనికోసం ఓ కంపెనీ సైతం నిర్విరామంగా పనిచేస్తుంది. స్కాట్స్‌డేల్‌లోని ఎడారి వాతావరణంలో అరిజోనా అనే ప్రాంతంలో 50 ఏళ్ల నుంచి 147 మెదళ్లు, డెడ్ బాడీలను భద్రపరిచారు. అన్నీ ద్రవ నైట్రోజన్‌లో భద్రపరిచారు. ధర్మల్ స్లీపింగ్ బ్యాగుల్లో శవాలను ఉంచి అల్యూమినియం కేసుల్లో లిక్విడ్ నెట్రోజన్‌లో భద్రపరిచారు. ఏదో ఒక రోజు సైన్ అభివృద్ధి చెందితే.. వాటిన పునరుద్ధరించబడాలనే లక్ష్యంతో క్రయోప్రెజర్డ్ పద్దతిలో ఇక్కడ భద్రపరుస్తున్నారు. డెడ్ బాడీని భద్రపరచడం కోసం అయ్యే ఖర్చు.. అక్షరాల రెండు లక్షల డాలర్లు. మన కరెన్సీలో రూ.1.50 కోట్లు (15169983) పైగానే.
ఇక్కడ 50 ఏళ్లకు పైగా మృతదేహాలను భద్రపరిచినట్లు ఆల్కోర్ కంపెనీ సీఈవో మాక్స్ మోర్ వెల్లడించారు. సైన్స్-ఆధునిక వైద్యంపై ఆశలతో యాంటీఫ్రీజ్‌తో శరీరాన్ని సంరక్షించే అభ్యాసాన్ని మొదలుపెట్టినట్లు మాక్స్ మోర్ వెల్లడించారు. ఒక వ్యక్తి చనిపోయిన సమయం నుంచి తమ రెస్క్యూ ప్రారంభమవుతుందని మాక్స్ తెలిపారు. ఆల్కోర్ బృందం ఐస్ బాత్‌ను సిద్ధం చేసి, రోగి ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయికి పడిపోయే వరకు 16 రకాల మందులు, యాంటీ-ఫ్రీజ్ విధానాన్ని అందించడం ప్రారంభిస్తుందన్నారు. రెస్క్యూ ఎంత వేగంగా ప్రారంభిస్తామో.. శీతలీకరణ ప్రక్రియను అంతే వేగంగా ప్రారంభిస్తామన్నారు. బ్రిటన్, కెనడా, జర్మనీలలో సైతం ఆల్కోర్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. అయితే.. శరీరం మొత్తంతోపాటు.. అవయవాల పరంగా తమ ప్యాకేజీ ఉంటుందని తెలిపారు. న్యూరో ఆప్షన్ సహా పలు రకాల ఎంపికలతో బాడీని భద్రపరుస్తామని పేర్కొన్నారు.

Human Body Frozen
ఆల్కోర్‌లోకి వచ్చే ముందు “న్యూరో” ఎంపికను ఎంచుకుంటే.. ఒప్పందం కుదుర్చుకున్న సర్జన్ రోగి తలను తీసివేస్తాడని.. ఆ తర్వాత భద్రపరుస్తామని తెలిపారు. అవయవాల ప్రకారం అయితే ఇది చాలా చౌకైన మార్గం అని.. దీని ప్రారంభ ధర $80,000 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఇది మొత్తం శరీరాన్ని కాపాడుకోవడానికి అయ్యే ఖర్చులో సగం కంటే ఎక్కువ. దీనికి కనిష్టంగా $200,000 అవసరమవుతుందని.. చాలా మంది వ్యక్తులు జీవిత బీమాతో చెల్లిస్తారని అని మోర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 147 శరీరాలు ఉన్నాయని.. వాటిని పూర్తి పర్యవేక్షణలో భద్రపరిచినట్లు వెల్లడించారు.
Also Read:




