Driverless Trucks: డ్రైవర్ లేకుండానే నడిచే ట్రక్కులు.. అమెరికా కంపెనీ అద్భుత ఆవిష్కరణ..
Driverless Trucks: సరుకు రవాణా కోసం ఎంతలా వాయు, జల మార్గాలు ఉన్నా రోడ్డు మార్గంపై ప్రయాణం సాగకపోతే అసంపూర్తేనని చెప్పాలి. మారుమూల ప్రాంతాలకు సరుకులు చేరుకువాలంటే కచ్చితంగా రోడ్డు మార్గాన వెళ్లాల్సిందే. ఇలా రోడ్డు మార్గంలో సరుకులు..
Driverless Trucks: సరుకు రవాణా కోసం ఎంతలా వాయు, జల మార్గాలు ఉన్నా రోడ్డు మార్గంపై ప్రయాణం సాగకపోతే అసంపూర్తేనని చెప్పాలి. మారుమూల ప్రాంతాలకు సరుకులు చేరుకువాలంటే కచ్చితంగా రోడ్డు మార్గాన వెళ్లాల్సిందే. ఇలా రోడ్డు మార్గంలో సరుకులు రవాణ చేయడానికి ఎక్కువగా లారీలు, ట్రక్కులను ఆశ్రయిస్తుంటారు. మారుతోన్న కాలానుగుణంగా యువత ఆలోచనలో మార్పులు వస్తున్నాయి. డ్రైవింగ్ రంగంలోకి రావడానికి చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా డ్రైవర్ల కొరత విపరీతంగా ఏర్పడుతోంది. మనదేశంలోనూ ఇటీవల ఈ సమస్య ఉత్పన్నమైన విషయం తెలిసిందే. అయితే ఒకవైపు డ్రైవర్లు తగ్గుతుంటే మరోవైపు ట్రక్‌ల వినియోగం బాగా పెరుగుతోంది. కరోనా (Corona) పరిస్థితుల తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ బాగా పెరిగిపోయింది. దీంతో సరకుల రవాణా కూడా పెరిగిపోయింది. అయితే పెరుగుతోన్న అవసరాలకు అనుగుణంగా డ్రైవర్లు మాత్రం రావడం లేదు. దీంతో భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి అమెరికాకు చెందిన ఓ సంస్థ అసలు డ్రైవర్ల అవసరమే లేని ట్రక్కులను రూపొందిస్తోంది.
టియూసింపుల్ (Tusimple) పేరుతో అమెరికాలోని శాన్ డీజియోలో 2015లో స్థాపించిన ఈ సంస్థ డ్రైవర్ రహిత ట్రక్కులను తయారు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా, చైనా, యూరప్‌లలో 70 ట్రక్కులతో సుమారు 2 మిలియన్ మైళ్ల దూరం ఈ డ్రైవర్ రహిత ట్రక్కులను విజయవంతంగా టెస్ రన్ చేసింది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ట్రక్కుల తయారీ సంస్థగా పేరుగాంచిన టియూసింపుల్.. వ్యోక్స్‌వ్యాగన్‌కు చెందిన ట్రాటన్ కంపెనీ భాగస్వామ్యంతో డ్రైవర్ రహిత ట్రక్కుల రూపకల్పన చేస్తోంది. 2024 నాటికి పూర్తి స్థాయిలో డ్రైవర్ రహిత ట్రక్కులను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉందీ కంపెనీ. నోగలెస్, అరిజోనా నుంచి ఓక్లహోమా నగరం వరకు సుమారు 951 మైళ్ల దూరం ఈ ట్రక్కులను పరీక్షించారు.
Also Read: Cloves Water Benefits: లవంగాల నీరు తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? ఆ సమస్యలకు విరుగుడు మందు ఇదే..
MANAGE Hyderabad Jobs 2022: నెలకు రూ.42,000ల జీతంతో హైదరాబాద్ మేనేజ్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
CIPET Recruitment 2022: బీటెక్/ఎంటెక్ అర్హతతో సీపెట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..