Canada: టొరంటో కాల్పుల్లో ఇండియన్ విద్యార్ధి మృతి.. భారత విదేశాంగ మంత్రి సంతాపం..
కెనడాలోని టొరంటోలో గురువారం (ఏప్రిల్ 7) సాయంత్రం జరిపిన కాల్పుల ఘటనలో 21 ఏళ్ల గ్లోబల్ ఇండియన్ స్టూడెంట్ మృతి చెందాడు. ఘటనపై టొరంటో పోలీసులు..
Indian student killed in Canada: కెనడాలోని టొరంటోలో గురువారం (ఏప్రిల్ 7) సాయంత్రం జరిపిన కాల్పుల ఘటనలో 21 ఏళ్ల ఇండియన్ స్టూడెంట్ మృతి చెందాడు. ఘటనపై టొరంటో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టొరంటో బాధితుడు కార్తీక్ వాసుదేవ్ (21) సబ్‌వే స్టేషన్ ప్రవేశ ద్వారం నుంచి హోవార్డ్ స్ట్రీట్ వైపు వెళ్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కార్తీక్ వాసుదేవ్ తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ఘటనపై సమీప సీసీ టీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు తెలియజేశారు.
దీనికి సంబంధించి.. టొరంటో కాల్పుల్లో దురదృష్టవశాత్తు భారత సంతతికి చెందిన విద్యార్ధి మరణించాడని, మృత దేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని ఇండియన్ ఎంబసీ తెలిపినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. ఈ విషాదఘటనపై మృతుడు కార్తీక్ వాసుదేవ్ కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్తీక్ వాసుదేవ్ జనవరిలో కెనడాకు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లాడు. అక్కడ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ కోర్సులో మొదటి సెమిస్టర్ చదువుతున్న కార్తిక్ వాసుదేవ్ అనతికాలంలోనే మృతి చెందడంతో తోటి విద్యార్ధులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Grieved by this tragic incident. Deepest condolences to the family. https://t.co/guG7xMwEMt
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 8, 2022
Also Read: