DEBIT LOAD: రాష్ట్రాల రుణాలు దేశానికి అరిష్టం.. లంక సంక్షోభం గుణపాఠం కావాలి కానీ రాష్ట్రాల తీరే విఘాతం!

2007లో అప్పుల భారం జీడీపీలో 70 శాతం కాగా.. 2021 లెక్కల ప్రకారం 135 శాతానికి చేరి, ప్రమాదకర పరిస్థితికి సంకేతంగా నిలుస్తోంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఏ దేశమైనా తమ దేశ జీడీపీలో 77 శాతం కంటే ఎక్కువ రుణాలు చేస్తే ఆ దేశం ఆర్థికంగా హీన దశలో కొనసాగుతుంది అని...

DEBIT LOAD: రాష్ట్రాల రుణాలు దేశానికి అరిష్టం.. లంక సంక్షోభం గుణపాఠం కావాలి కానీ రాష్ట్రాల తీరే విఘాతం!
Pm Modi
Follow us
Rajesh Sharma

| Edited By: Ravi Kiran

Updated on: Apr 09, 2022 | 3:31 PM

DEBIT LOAD ON INDIA INCREASING STATES DEBT INCREASING RAPIDLY: కోవిడ్.. ఈ పదం రెండేళ్ళ నుంచి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు దాదాపు అన్ని దేశాలు, అన్ని రంగాలు కుదేలైపోయాయి. నిరవధిక లాక్ డౌన్ల కారణంగా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాయి. కోవిడ్ సృష్టించిన అనిశ్చిత వాతావరణం ప్రపంచ దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. దేశాలన్నీ తమ ఆదాయానికి మించి వ్యయాలను చేయాల్సి వచ్చింది. ఫలితంగా చాలా దేశాలకు పెద్ద ఎత్తున రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. 2020 తొలినాళ్ళలో మొదలైన సంక్షోభ పరిస్థితి.. రెండేళ్లైనా కోలుకోలేకుండా తయారైంది. ఇపుడు చాలా దేశాలు అప్పుల భారంతో ఇబ్బందులెదుర్కొంటున్నాయి. కరోనా కాలం కంటే ముందు అంటే 2019 నాటి స్థితిగతులతో పోలిస్తే ప్రపంచ దేశాల రుణభారం 35 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం ప్రపంచ దేశాలన్నింటి అప్పు 226 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని ఐఎంఎఫ్ చెబుతోంది. లాక్ డౌన్ల కారణంగా స్థంభించిన ఆర్థిక లావాదేవీలతో అన్ని దేశాల్లో సంక్షోభం ఏర్పడింది. దాన్ని అధిగమించేందుకు చాలా దేశాలు భారీగా అప్పులను చేశాయి. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలకు కూడా మినహాయింపు లేకపోవడంతో రుణభారం తలకు మించిపోయింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. పెరిగిన ఈ అప్పుల భారంలో 90 శాతం అభివృద్ధి చెందిన దేశాలదే కావడం. తాజా గణాంకాల ప్రకారం అభివృద్ది చెందిన దేశాల రుణభారం ఆయా దేశాల జీడీపీ కంటే ఎక్కువగా వుంది. 2007లో అప్పుల భారం జీడీపీలో 70 శాతం కాగా.. 2021 లెక్కల ప్రకారం 135 శాతానికి చేరి, ప్రమాదకర పరిస్థితికి సంకేతంగా నిలుస్తోంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఏ దేశమైనా తమ దేశ జీడీపీలో 77 శాతం కంటే ఎక్కువ రుణాలు చేస్తే ఆ దేశం ఆర్థికంగా హీన దశలో కొనసాగుతుంది అని అర్థం.

ఇక మనదేశం విషయానికి వస్తే గత రెండు సంవత్సరాలలో మూడు కోవిడ్ వేవ్స్ వచ్చాయి. 2022 జనవరి 31న మనదేశంలో తొలి కరోనా కేసు నమోదు కాగా.. మార్చి చివరి వారం నుంచి మనదేశంలో కరోనా విజృంభించింది. దాదాపు 8 నెలల పాటు దేశంలో లాక్ డౌన్ వివిధ దశల్లో కొనసాగింది. ఆ తర్వాత కరోనా తగ్గిపోయింది అనుకుంటున్న తరుణంలో తిరిగి ఏప్రిల్ 2021లో కరోనా రెండో దశ మొదలైంది. దాదాపు నాలుగు నెలల పాటు దేశాన్ని అతలాకుతలం చేసింది. తిరిగి 2022 జనవరిలో థర్డ్ వేవ్ వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఈలోగా వ్యాక్సిన్ పంపిణీలో ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది భారత్. కరోనా వేవ్‌ల తర్వాత కూడా మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశ ఆర్థిక పరిస్థితి కాసింత మెరుగ్గానే వుందని చెప్పుకోవాలి. 2018లో మన దేశ జీడీపీలో అప్పుల శాతం 70.44గా వుండేది. కోవిడ్ అనంతర పరిస్థితిలో మనదేశం అప్పుల భారం జీడీపీలో 90.6 శాతానికి చేరింది. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో జీడీపీకంటే అధికంగా అంటే.. వందశాతానికి కంటే ఎక్కువగా, కొన్ని దేశాలది అయితే ఏకంగా జీడీపీలో 135 శాతంగా రుణభారం చేరుకుంది. మనదేశ అప్పుల్లో 60 శాతం కేంద్ర ప్రభుత్వానిదే. మిగిలిన 40 శాతం రాష్ట్రాల అప్పుల భారం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మనదేశంలో సగం రాష్ట్రాలు అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇందులో మంచి ఆదాయ వనరులున్న తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్నాటక వంటి రాష్ట్రాలు కూడా వుండడం విడ్డూరం. 2022 జనవరి నాటికి మనదేశంలో పంజాబ్ అప్పులు అధికంగా కనిపిస్తున్నాయి. 3.01 లక్షల కోట్ల రూపాయల అప్పులతో జీఎస్డీపీలోఏకంగా 53.3 శాతం అప్పులతో రుణాగ్రరాష్ట్రంగా పంజాబ్ కనిపిస్తోంది. ఆ తర్వాత స్థానం రాజస్థాన్ ది. ఆ రాష్ట్రానికి 3.46 లక్షల కోట్లు అప్పు కాగా.. జీఎస్డీపీలో అప్పుల శాతం 39.8గా వుంది. మూడోస్థానంలో వున్న బెంగాల్ రాష్ట్రానికి 5.28 లక్షల కోట్ల రూపాయల అప్పు కాగా.. ఇది జీఎస్డీపీలో 38.8 శాతం. 3.27 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో వున్న కేరళ నాలుగో స్థానంలో వుంది. కేరళ అప్పుల శాతం జీఎస్డీపీలో 38.3 శాతం. ఆ తర్వాత అయిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ వుంది. 3.89 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఏపీ.. జీఎస్డీపీలో 37.6 శాతం రుణభారాన్ని మోస్తోంది. ఆరోస్థానంలో వున్న ఉత్తర ప్రదేశ్‌కు ఏకంగా 6.62 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఇది ఆ రాష్ట్ర జీఎస్డీపీలో రుణభారం 28.8 శాతం. ఆ తర్వాత స్థానం తమిళనాడుది కాగా.. ఆ రాష్ట్రానికి 3.3 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. అది రాష్ట్ర జీఎస్డీపీలో 26.29 శాతం. ఇక ఎనిమిదోస్థానంలో వున్న తెలంగాణ రాష్ట్రానికి 2.85 లక్షల కోట్ల అప్పుంది. అది జీఎస్డీపీలో 25.27 శాతం. ఆ తర్వాత స్థానంలో వున్న కర్నాటక తమ జీఎస్డీపీలో 24.49 శాతంతో 2.52 లక్షల కోట్ల అప్పులతో కొనసాగుతోంది. రాష్ట్రాలు ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తున్నాయని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఎఫ్ఆర్బీఎం శాతాన్ని పెంచాలంటూ తెలంగాణ వంటి రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. షరతులతో ఎఫ్ఆర్బీఎం శాతాన్ని పెంచితే కేంద్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎడాపెడా అప్పులు చేసేస్తున్న రాష్ట్రాలు ఆ నిధులను ఉపాధి కల్పన, వసతుల కల్పన వంటి వాటిపై వెచ్చించకుండా.. తమ ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రకటించిన ఉచితాలకు వెచ్చిస్తున్నాయి. దీంతో రుణాలను తిరిగి చెల్లించే పరిస్థితి సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. 2019లో మనదేశంలో రాష్ట్రాలన్నీ కలిపి చెల్లించాల్సిన అప్పులు 47.86 లక్షల కోట్లుగా వుండగా.. ప్రస్తుతం 2022నాటికి ఆ రుణభారం ఏకంగా 70 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.

ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ఆర్థిక స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. అందులో పాల్గొన్న పలువురు ఆర్థిక శాఖ అధికారులు అప్పుల విషయంలో రాష్ట్రాలు అవలంభిస్తున్న తీరును ప్రధాన మంత్రికి వివరించారు. అప్పు చేసి పప్పు కూడైనా తినడం లేదని.. తాము ఎడాపెడా ఇచ్చేస్తున్న ప్రజాకర్షక పథకాల కోసం రుణమొత్తాలను వినియోగిస్తున్నాయని అధికారులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. రాష్ట్రాల తీరు దేశాన్ని ఆర్థిక మాంధ్యంలోకి నెట్టేలా వుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల రుణభారం జీఎస్డీపీలో 40 శాతానికి చేరువలో వుంది. మొత్తమ్మీద సగటు 32 శాతంగా కనిపిస్తోంది. ఏపీ విషయాన్నే తీసుకుంటే 2014లో ఉమ్మడి ఏపీ విడిపోయేనాటికి ఏపీకి 97 వేల 123 కోట్ల రూపాయల అప్పుంది. 2014లో పరిపాలనపగ్గాలు చేపట్టిన చంద్రబాబు అయిదేళ్ళ కాలంలో ఏకంగా లక్షా 65 వేల కోట్ల రూపాయలు కొత్తగా అప్పు తెచ్చారు. ఆయన్ను ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అధిగమిచబోతున్నట్లు ఆయన రెండున్నరేళ్ళ పాలన చాటుతోంది. జగన్ రెండేళ్ళ కాలంలోనే లక్షా 15 వేల కోట్ల రూపాయలు కొత్తగా రుణం తెచ్చారు. ఇటు తెలంగాణలో పన్నుల రెవెన్యూ గణనీయంగా పెరుగుతున్నా కొత్తగా అప్పులు తేవడం మాత్రం ఆగడం లేదు. పెన్షన్లు, రైతుల ఖాతాల్లోకి నగదు జమ, విద్యుత్ రాయితీల కారణంగా తెలంగాణ అప్పులను చేస్తూ పోతోంది. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో సర్కార్ ఉద్యోగులకు జీతాలను ఒకటో తారీఖున ఇచ్చే సంప్రదాయానికి ఎప్పుడో తిలోదకాలిచ్చేశారు. ఏప్రిల్ నెలలో 9వ తేదీ వచ్చినా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాకపోవడం తెలంగాణ ఆర్థిక దుస్థితిని చాటుతోంది. విపరీతమైన అప్పుల కారణంగానే ఇపుడు శ్రీలంక రావణకాష్టంలా మారింది. గతంలో వెనుజులా అనుభవాన్ని కూడా చూశాం. ఈక్రమంలో రాష్ట్రాల రుణభారాలను తగ్గించేందుకు కేంద్రం ఓ స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సి వుంది. ఎఫ్ఆర్బీఎం వెసులుబాటు కల్పన విషయంలోను మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమూ కనిపిస్తోంది.

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!