Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Today Horoscope (December 28, 2024): మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గు ముఖం పడతాయి. వృషభ రాశి వారికి అనుకోకుండా ఉద్యోగంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఇలా..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 28th December 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 28, 2024 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 28, 2024): మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ప్రత్యేక బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. అధికార వర్గాల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గు ముఖం పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు బంధు మిత్రులతో విభేదాలు, వివాదాలు సమసిపోతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెడతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అనుకోకుండా ఉద్యోగంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఎదురు ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొద్దిపాటి ప్రయ ప్రయాసలతో ముఖ్య మైన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. వ్యాపా రంలో లాభాలు నిలకడగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. కొందరు సహోద్యోగుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవు తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగం విషయంలో బాగా సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ప్రయాణాలలో లాభాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహా రాలు సాదాసీదాగా సాగిపోతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన వృద్ధి చెందుతాయి. ఆదాయపరంగా శుభ యోగాలు పడతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబసమేతంగా ఆల యాలు సందర్శిస్తారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం శుభవార్త అందుతుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలకు లోటుం డదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహా రాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయ కపోవడం మంచిది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలలో అనుకూలతలు పెరుగుతాయి. అధికారులు బాగా ప్రోత్సహిస్తారు. వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. అనుకున్న పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యా త్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ ప్రయత్నాలు చాలా మేరకు సఫలమవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా, ఆశాజనకంగా పురోగతి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభాలు కలి గిస్తాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. చేపట్టిన పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవు తాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులుం టాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక పరి స్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. విద్యార్థులకు తేలికగా విజయాలు లభిస్తాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి.