”గవర్నర్లను ఎలా గౌరవించాలో మాకు తెలుసు.. వాస్తవానికి ఆ వ్యవస్థ అవసరమే లేదు”.. మంత్రి తలసాని షాకింగ్ కామెంట్స్
తెలంగాణ ప్రభుత్వం-గవర్నర్ మధ్య దూరం పెరుగుతోంది. గవర్నర్(Governor) తమిళిసై వ్యాఖ్యలపై టీఆర్ మంత్రులు, నేతలు స్పందిస్తూ తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్లను గౌరవించడంలో సీఎం...
తెలంగాణ ప్రభుత్వం-గవర్నర్ మధ్య దూరం పెరుగుతోంది. గవర్నర్(Governor) తమిళిసై వ్యాఖ్యలపై టీఆర్ మంత్రులు, నేతలు స్పందిస్తూ తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్(CM KCR) అందరికంటే ముందుంటారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Talasani Srinivas Yadav) అన్నారు. ఎలాంటి లోటుపాట్లు జరగనప్పుడు విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. గవర్నర్లను ఎలా గౌరవించాలో ముఖ్యమంత్రికి, తమకు తెలుసునన్న మంత్రి.. గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలన్నారు. మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదని అంతే కాకుండా.. ప్రధాని, కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత తమపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న, మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి లోటుపాట్లు జరగనప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.
గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. గవర్నర్‌కు ఒక పరిధి ఉంది. ఆ పరిధిని భారత రాజ్యాంగం పెట్టింది. పెద్దల సభలో నియామకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. భాజపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపడం లేదా? డ్రగ్స్ విషయంలో సీఎం ఆగ్రహంగా ఉన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని సీఎం ఆదేశించారు
– తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ మంత్రి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించడం లేదని, వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ మంచి పనుల్ని తాను అభినందించానని, పలు సూచనలు చేశానని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితులను అమిత్‌షాకు గవర్నర్ వివరించారు. గవర్నర్ కామెంట్స్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Also Read
Telangana Crime: బాలుడిని బలిగొన్న అనుమానం.. కుమారుడి మృతికి వారే కారణమంటూ.. ఆఖరుకు
Viral Video: అత్యంత ప్రమాదకర రక్తపింజర పామును ఎలా పట్టుకున్నాడో చూడండి.!