Telangana Crime: బాలుడిని బలిగొన్న అనుమానం.. కుమారుడి మృతికి వారే కారణమంటూ.. ఆఖరుకు
అనుమానం పెనుభూతమైంది. పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తన కుమారుడి మృతికి భర్త సోదరే కారణమని ఓ మహిళ అనుమానం పెంచుకుంది. ఆ అనుమానంతో మరదలి కుమారుడిని దారుణంగా...
అనుమానం పెనుభూతమైంది. పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తన కుమారుడి మృతికి భర్త సోదరే కారణమని ఓ మహిళ అనుమానం పెంచుకుంది. ఆ అనుమానంతో మరదలి కుమారుడిని దారుణంగా హత్య(Murder) చేసింది. మృతదేహాన్ని కాలువలో పడేసింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు బయటపడ్డాయి. నిజామాబాద్(Nizamabad) ఆటోనగర్ కాలనీకి చెందిన రుక్సానాబేగం, అస్లాంఖాన్ దంపతుల కుమారుడు ఫైజల్‌ఖాన్ ఓ గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటన తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. బాలుడు మృతి చెందిన సమయంలో అతని వయస్సు మూడేళ్లు. తన కుమారుడు అర్థాంతరంగా చనిపోవడానికి తన భర్త అస్లాంఖాన్ చెల్లెలు సనాబేగమే కారణమని రుక్సానా అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో మార్చి 31న ఇంటి దగ్గర ఆడుకొంటున్న సనాబేగం కుమారుడు ఫయాజ్ ను ఆటోలో బోధన్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఒకరి ఇంట్లో ఉంచి తిరిగి ఇంటికి చేరుకుంది. అప్పటికే బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. వారితో కలిసి తానూ వెతుకుతున్నట్లు నటించింది.
అదే రోజు రాత్రి మరోసారి బోధన్‌కు వెళ్లింది. అనంతరం అక్కడ బాలుడిని హత్య చేసింది. అనంతరం నిజాంసాగర్ కాలువలో పడేసింది. కాల్వలో కొట్టుకొచ్చిన బాలుడి మృతదేహాన్ని పలువురు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. బాలుడిని హత్య చేసింది తన మేనత్త రుక్సానాబేగం, మరో బాలిక అని పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేశారు.
Also Read
Viral Video: జింక పిల్ల, చిరుత పిల్ల మధ్య చాలా సేపు ఫైట్.. చివరకు ఊహించని ట్విస్ట్
Canada: టొరంటో కాల్పుల్లో ఇండియన్ విద్యార్ధి మృతి.. భారత విదేశాంగ మంత్రి సంతాపం..
Cloves Water Benefits: లవంగాల నీరు తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? ఆ సమస్యలకు విరుగుడు మందు ఇదే..