AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NH-44: ఆరు లైన్లుగా హైదరాబాద్ – బెంగళూరు హైవే.. అంచనాలు సిద్ధం చేసిన కేంద్రం

హైదరాబాద్ - బెంగళూరు(Hyderabad - Bangalore) మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దేశంలోనే అత్యంత పొడవైన 44వ నంబర్ జాతీయ రహదారి(శ్రీనగర్ - కన్యాకుమారి) ని నాలుగు లైన్లు నుంచి ఆరు లైన్లుగా విస్తరించాలని...

NH-44: ఆరు లైన్లుగా హైదరాబాద్ - బెంగళూరు హైవే.. అంచనాలు సిద్ధం చేసిన కేంద్రం
High Way
Ganesh Mudavath
|

Updated on: Apr 09, 2022 | 4:39 PM

Share

హైదరాబాద్ – బెంగళూరు(Hyderabad – Bangalore) మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దేశంలోనే అత్యంత పొడవైన 44వ నంబర్ జాతీయ రహదారి(శ్రీనగర్ – కన్యాకుమారి) ని నాలుగు లైన్లు నుంచి ఆరు లైన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్మాణాలు చేయనున్నారు. దక్షిణ భారతదేశం(South India) లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరులలో ఐటీ, బీటీ, ఫార్మా, స్టార్టప్‌ కంపెనీలు అధికంగా ఉన్నాయి. దీంతో రెండు నగరాల మధ్య రాకపోకలు అధికంగా ఉంటాయి. పైగా దేశంలోని ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్లేందుకు 44వ నంబరు జాతీయ రహదారి ఏడు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తోంది. కర్ణాటక(Karnataka) పరిధిలో 150 కిలోమీటర్ల మేర 44వ జాతీయ రహదారి ఉంది. బెంగళూరు – హైదరాబాద్‌ మధ్య ప్రస్తుతం ఉండే నాలుగులైన్ల రహదారిని ఆరులైన్లకు విస్తరింపచేసేందుకు రూ.4,750 కోట్లు ఖర్చుకానున్నట్లు అంచనా వేశారు.

బెంగళూరు – హైదరాబాద్‌ నగరాల మధ్య 570 కిలోమీటర్ల దూరం ఉంది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 12 గంటలు. నాలుగులైన్ల రహదారి విస్తరించాక ప్రయాణపు వ్యవధి 8 గంటలకు తగ్గింది. ఆరులైన్ల ప్రక్రియ పూర్తయితే ప్రయాణ సమయం మరింత ఆదా అయ్యే అవకాశం ఉంది. రోడ్డు విస్తరణతో పాటు రియల్‌టైం డిజిటల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి.. సూపర్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ రహదారిగా మార్చనున్నారు. రహదారి పొడవునా డిజిటల్‌ బోర్డులు, ఆసుపత్రులు, పెట్రోలు బంకులు, ట్రాఫిక్‌ సమాచారాన్ని తెలియచేసే సాంకేతిక విధానం అమలు చేస్తారు.

Also Read

కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వారికి ఎటువంటి హామిలేకుండా10 లక్షల రుణం..

”గవర్నర్లను ఎలా గౌరవించాలో మాకు తెలుసు.. వాస్తవానికి ఆ వ్యవస్థ అవసరమే లేదు”.. మంత్రి తలసాని షాకింగ్ కామెంట్స్

Canada: టొరంటో కాల్పుల్లో ఇండియన్‌ విద్యార్ధి మృతి.. భారత విదేశాంగ మంత్రి సంతాపం..