AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర ప్రభుత్వ బంపర్ ఆఫర్.. వారికి ఎటువంటి హామీ లేకుండా పది లక్షల వరకూ రుణం!

PMMY: ప్రధాన మంత్రి ముద్రా యోజన ( పీఎంఎంవై ) కింద ప్రభుత్వం 34.42 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.18.60 లక్షల కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ పథకం 7 ఏళ్ల సమాచారాన్ని

కేంద్ర ప్రభుత్వ బంపర్ ఆఫర్.. వారికి ఎటువంటి హామీ లేకుండా పది లక్షల వరకూ రుణం!
Pmmy
uppula Raju
|

Updated on: Apr 09, 2022 | 5:13 PM

Share

PMMY: ప్రధాన మంత్రి ముద్రా యోజన ( పీఎంఎంవై ) కింద ప్రభుత్వం 34.42 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.18.60 లక్షల కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ పథకం 7 ఏళ్ల సమాచారాన్ని ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8 ఏప్రిల్ 2015 న ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించారు. దీని కింద చిన్న వ్యాపారానికి రూ.10 లక్షల వరకు రుణం అందిస్తారు. ఈ పథకం ఎక్కువగా చిన్న వ్యాపారాలు ప్రారంభించేవారికి ఆర్థిక సహాయం అందిస్తుంది. వాస్తవానికి స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు ఆర్థిక సహాయం చేసి చిన్న వ్యాపారం ఏర్పాటు చేయడం. దీంతో వారు స్వావలంబనతో ఇతరులకు ఉపాధి కల్పిస్తారు. ఈ పథకంలో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తారు. ఇప్పటివరకు 68 శాతం మహిళలకు, 22 శాతం కొత్త పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు చేశారు.

ప్రభుత్వం ప్రకారం ఈ పథకం కింద జారీ చేసిన అన్ని రుణాలలో 51 శాతం SC / ST / OBC కేటగిరీలకు అందించారు. దేశంలోని ఏయే జిల్లాల్లో ముద్రా యోజన పథకం అవసరమో ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది. ఆ జిల్లాలపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తోంది. PMMY కింద రూ.10 లక్షల వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా ప్రభుత్వం రుణం ఇస్తుంది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లలో దరఖాస్తు చేసుకోవచ్చు. తయారీ, వ్యాపారం, సేవా రంగం, వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారం కోసం ముద్రా యోజనలో రుణాలు అందిస్తారు. దీని కింద మూడు రకాల రుణాలు ఇస్తారు – శిశు రుణం రూ. 50,000 వరకు, కిషోర్ రుణం 50,000 నుంచి 5 లక్షల వరకు, తరుణ్ రుణం రూ.10 లక్షల వరకు ఇస్తారు.

ఈ పత్రాలు అవసరం

ఫారమ్‌ను నింపడానికి మీ వద్ద ఆధార్, పాన్ ఉండాలి. మీ శాశ్వత చిరునామా, వ్యాపార చిరునామా, నివాస స్థలం రుజువు, మూడేళ్ల బ్యాలెన్స్ షీట్, ఆదాయపు పన్ను రిటర్న్, స్వీయ-పన్ను రిటర్న్ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అందించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి..

1. ముందుగా ముద్రా యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.

3. లోన్ కావాలనుకుంటున్న కేటగిరీపై క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. ఇక్కడ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

5. దరఖాస్తు ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

6. దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని చదవండి. తదనుగుణంగా సరిగ్గా నింపండి.

7. కొన్ని పత్రాల ఫోటోకాపీలు అడుగుతారు. అవి యాడ్‌ చేయండి.

8. ఈ దరఖాస్తు ఫారమ్‌ను మీ సమీపంలోని బ్యాంకుకు సమర్పించండి.

9. బ్యాంక్ మీ దరఖాస్తును ధృవీకరిస్తుంది 1 నెలలోపు రుణం మంజూరు చేస్తుంది.

10. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి పేరు, పాస్‌వర్డ్‌ను సృష్టించాలి. దీని సాయంతో ముద్ర లోన్ వెబ్‌సైట్‌ లాగిన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Beauty Tips: కళ్లకింద ముడతలు తొలగాలంటే ఈ 5 పదార్థాలు బెస్ట్‌.. ఖర్చు కూడా పెద్దగా ఉండదు..!

Health: తల్లి దండ్రులకి జాగ్రత్త.. ఈ సమస్య పిల్లలు, వృద్ధులకి చాలా డేంజర్..!

ఈ 2 ప్రభుత్వ పథకాలలో విపరీతంగా పెట్టుబడులు.. ప్రతినెలా పెన్షన్ పెద్ద మొత్తంలో డబ్బు..!