Health: తల్లి దండ్రులకి జాగ్రత్త.. ఈ సమస్య పిల్లలు, వృద్ధులకి చాలా డేంజర్..!

Health: వేసవి కాలంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. చెడ్డ ఆహారపు అలవాట్లు, పాడైపోయిన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఫుడ్ పాయిజనింగ్

Health: తల్లి దండ్రులకి జాగ్రత్త.. ఈ సమస్య పిల్లలు, వృద్ధులకి చాలా డేంజర్..!
Children
Follow us
uppula Raju

|

Updated on: Apr 09, 2022 | 3:18 PM

Health: వేసవి కాలంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. చెడ్డ ఆహారపు అలవాట్లు, పాడైపోయిన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. వాంతులు, విరేచనాలతో అవస్థ పడుతారు. ఈ సమస్య పిల్లల్లో, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎండాకాలంలో బయటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆహారం విషయంలో శుభ్రత పాటించకపోవడంతో ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్య మూడు నుంచి నాలుగు రోజులు ఉంటుంది. కానీ ఫుడ్ పాయిజనింగ్ సమస్య గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు ప్రమాదకరంగా మారుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అనేది ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు బజారులో దొరికే ఆహార పదార్థాలను ఇష్టంగా తింటారు. కానీ వాటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఫంగస్ ఉంటాయి. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని నుంచి వచ్చే టాక్సిన్స్ ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఇది కడుపు నొప్పి, వాంతులు, లూజ్ మోషన్, తలనొప్పికి కారణమవుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులలో ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాంటీబయాటిక్స్ ద్వారా ఈ చికిత్స నుంచి బయటపడవచ్చు. చిన్నపిల్లలకు ORS తాగిస్తే చాలా ఉపశమనం లభిస్తుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి

పాఠశాలలు తెరుచుకోవడంతో పిల్లలు స్కూల్‌కి వెళ్లడం ప్రారంభించారు. ఈ పరిస్థితిలో వారు తరచుగా బయట ఆహారం తింటారు. దీనివల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ సమస్య పెరుగుతోంది. దీన్ని నివారించడానికి బయటి ఆహారాన్ని నివారించడం అవసరం. అంతేకాదు పాడైపోయిన ఆహారం తినకూడదు. రాత్రి మిగిలిన ఆహారం పిల్లలకి పెట్టకూడదు. తాజా ఆహారాన్ని మాత్రమే వడ్డించాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఎక్కువ ద్రవాలు తాగాలి. నిమ్మరసం, కొబ్బరి నీరు, సీజనల్ జ్యూస్ తాగుతూ ఉండాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

ఈ 2 ప్రభుత్వ పథకాలలో విపరీతంగా పెట్టుబడులు.. ప్రతినెలా పెన్షన్ పెద్ద మొత్తంలో డబ్బు..!

Relationship: ఈ 3 విషయాలు తెలిస్తే భార్యాభర్తల మధ్య అస్సలు గొడవలు ఉండవు..!

IPL 2022: దినేశ్‌ కార్తీక్ మళ్లీ టీమ్‌ ఇండియాకి తిరిగి వస్తాడు.. ఆశాభావం వ్యక్తం చేసిన మాజీ కోచ్..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!