IPL 2022: దినేశ్ కార్తీక్ మళ్లీ టీమ్ ఇండియాకి తిరిగి వస్తాడు.. ఆశాభావం వ్యక్తం చేసిన మాజీ కోచ్..!
IPL 2022: ఈ IPL 2022 భారత ఆటగాళ్లకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఏడాది చివర్లో జరిగే టీ 20 ప్రపంచకప్‌కి జట్టు ఇంకా ఖరారు కాలేదు. ఒక్కో స్థానానికి ఆటగాళ్ల మధ్య వార్ నడుస్తోంది.
IPL 2022: ఈ IPL 2022 భారత ఆటగాళ్లకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఏడాది చివర్లో జరిగే టీ 20 ప్రపంచకప్‌కి జట్టు ఇంకా ఖరారు కాలేదు. ఒక్కో స్థానానికి ఆటగాళ్ల మధ్య వార్ నడుస్తోంది. చాలామంది తమను తాము నిరూపించుకోవడానికి, జట్టులో చోటు సంపాదించడానికి IPL ఒక పెద్ద అవకాశంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్ కూడా ఐపీఎల్ ద్వారా జట్టులో చోటు సంపాదించగలడని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. KKR మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్ ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. ఇప్పుడు అతడు జట్టుకి మ్యాచ్ ఫినిషర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ కారణంగా త్వరలో తిరిగి టీమ్ ఇండియాలోకి రావచ్చని భావిస్తున్నాడు.
ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘దినేశ్‌కార్తీక్‌కి ఐపీఎల్ అనుకూలిస్తే మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అన్ని షాట్లూ ఆడగల సామర్థ్యం అతని సొంతం. ఇప్పుడు జట్టులో ధోనీ లేడు కాబట్టి ఒక ఫినిషర్ కావాలి. అంతేకాదు వికెట్‌కీపర్లు కూడా అవసరమే. ఇషాన్ కిషన్, రిషబ్ పంత్‌లలో ఎవరికైనా గాయమైతే ఆటోమేటిక్‌గా దినేష్ కార్తీక్ జట్టులోకి వస్తాడు. మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉండగా దినేష్ కార్తీక్ టీమ్ ఇండియాలో శాశ్వత స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఎందుకంటే వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ వంటి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లు రేసులో ఉండటం వల్ల కార్తీక్ వెనుకబడ్డాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో తనని తాను ఎప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం నిదహాస్ ట్రోఫీలో ఫినిషర్‌గా నిరూపించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో 8 బంతుల్లో 29 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. అందులో చివరి బంతికి సిక్స్ కూడా కొట్టాడని’ శాస్త్రి గుర్తుచేశాడు.