AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs GT: చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్.. టీ20లో తొలి భారతీయుడిగా రికార్డ్..

ఈ మ్యాచ్‌కు ముందు ఈ కీలక మైలురాయికి మరో 3 బౌండరీల దూరంలో నిలిచిన ధావన్.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై

PBKS vs GT: చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్.. టీ20లో తొలి భారతీయుడిగా రికార్డ్..
Ipl 2022, Pbks Vs Gt Shikhar Dhawan
Venkata Chari
|

Updated on: Apr 08, 2022 | 8:50 PM

Share

IPL 2022, PBKS vs GT: శిఖర్ ధావన్ శుక్రవారం టీ20 క్రికెట్‌లో 1000 బౌండరీలు కొట్టిన మొదటి భారతీయుడిగా మారాడు. అలాగే ఈ మైలురాయిని అందుకున్న 5వ బ్యాటర్‌గా నిలిచాడు. ముంబైలో గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ తరపున ధీటుగా ఆరంభించాడు. ఈ క్రమంలోనే ధావన్ ఈ ఫీట్ సాధించాడు. టీ20 క్రికెట్‌లో 1,000 బౌండరీలు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా శిఖర్ ధావన్ శుక్రవారం చరిత్ర సృష్టించి, వెస్టిండీస్ గ్రేట్ క్రిస్ గేల్‌తో సహా ఎలైట్ క్రికెటర్ల జాబితాలో చేరాడు. కాగా, ఈ భారత ఓపెనర్ ప్రపంచ క్రికెట్‌లో మొత్తంగా 5వ బ్యాటర్‌గా మారాడు.

శుక్రవారం తన 307వ టీ20 మ్యాచ్‌ని ఆడుతున్న శిఖర్ ధావన్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో తన కొత్త ఫ్రాంచైజీ అయిన పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ ఈ మైలురాయిని సాధించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు ఈ కీలక మైలురాయికి మరో 3 బౌండరీల దూరంలో నిలిచిన ధావన్.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ధావన్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌తో తన ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మహ్మద్ షమీ వేసిన 2వ ఓవర్‌లో మరో బౌండరీకి ​​దూసుకెళ్లడంతో ధావన్‌కు అదృష్టం కలిసి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ పేసర్ వేసిన తొలి ఓవర్‌లోనే ధావన్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో దాడి చేసి ఈ మైలురాయిని అందుకున్నాడు.

అత్యధిక ఫోర్‌లు బాదిన భారతీయులు..

1001: శిఖర్ ధావన్

917: విరాట్ కోహ్లీ

875: రోహిత్ శర్మ

779: సురేష్ రైనా

ధావన్ టీ20 క్రికెట్‌లో 8850కి పైగా పరుగులు చేశాడు. 36 ఏళ్ల అతను 2011లో T20I లలో భారత్‌ తరపున అరంగేట్రం చేయడానికి ముందు 2007లో ఢిల్లీ తరపున అరంగేట్రం చేశాడు.

Also Read: David Warner: సల్లూభాయ్‌గా మారిపోయిన వార్నర్‌.. దిశాపటానీతో డ్యాన్స్‌.. వైరల్‌గా మారిన వీడియో..

RCB vs MI IPL 2022 Match Prediction: బెంగళూరుతో పోరు రోహిత్ సేనకు అంత ఈజీ కాదు.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Vaibhav Suryavanshi: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు..
Vaibhav Suryavanshi: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు..
మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో
మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో
ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి
ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి
ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!
ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!
సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...
సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...
సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..
సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..
తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్
తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్
సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..
సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..
టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..
IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..