David Warner: సల్లూభాయ్‌గా మారిపోయిన వార్నర్.. దిశాపటానీతో డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో..
David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకున్నాడు
David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకున్నాడు. తెలుగు, హిందీ సినిమా పాటలకు తనదైన స్టెప్పులు వేస్తూ నెట్టింట్లో నయా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మార్ఫ్‌డ్ ఫేస్ యాప్ తో ఫేమస్ తెలుగు, హిందీ సినిమాల్లో హీరోల ముఖాన్ని తీసేసి.. అందులో తన ముఖాన్ని అతికించి.. పాటలు, డైలాగులు ఇరగదీశాడు. ఇక బన్నీ నటించిన పుష్ప సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన అందులోని పాటలు, డైలాగులు, ఫైట్లను అనుకరించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ఇమిటేట్ చేశాడు ఈ స్టార్ క్రికెటర్. సల్లూభాయ్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాలోని సీటీమార్ సాంగ్‌కు అద్భుతంగా స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది
వార్నర్ భాయ్..
ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ ముఖం ఫేస్‌లో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వార్నర్ దిశా పటానీతో డ్యాన్స్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. అంతేకాదు ఈ సాంగ్‌లో సల్మాన్ చేసిన హుక్ స్టెప్‌ను ఒరిజినల్‌గా చేయాలనుకుంటున్నానని, త్వరలోనే కొత్త ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో మళ్లీ మీ ముందుకు వస్తానని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు వార్నర్. కాగా ఈ వీడియోలో సల్మాన్ ఎక్స్ ప్రెషన్స్‌కు తగ్గట్టుగా తనదైన స్టైల్‌లో హావభావాలు ప్రదర్శించి ఆకట్టుకున్నాడు డేవిడ్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సల్మాన్ అభిమానులు వార్నర్ భాయ్.. వార్నర్ భాయ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు వార్నర్. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడిన అతడిని రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.
View this post on Instagram
Also Read: Viral Video: ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియన్ థాలీని ట్రై చేశాడు !! అంతే !!
TS RTC: తెలంగాణలో మరోసారి పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. పెంపుకు ఇదే కారణం..
TS RTC: తెలంగాణలో మరోసారి పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. పెంపుకు ఇదే కారణం..