Telangana: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మరో సారి బస్ ఛార్జీలను భారీగా పెంచిన TS RTC

ఛార్జీల పెంపుదలలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) దూసుకుపోతోంది. ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు లేకుండా పరుగులు పెడుతోంది.

Telangana: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మరో సారి బస్ ఛార్జీలను భారీగా పెంచిన TS RTC
Tsrtc Md Sajjanar
Follow us

|

Updated on: Apr 08, 2022 | 9:01 PM

ప్రయాణికుల వీపు మోత మోగించింది తెలంగాణ ఆర్టీసీ. బస్సు ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఛార్జీల పెంపుదలలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) దూసుకుపోతోంది. ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు లేకుండా పరుగులు పెడుతోంది. బస్సు ఛార్జీలను పెంచిన 10 రోజుల్లోనే మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు రూ.2 పెంచింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీకి రూ.5 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బస్సు సర్వీసులో కనీస ధర రూ.10గా పెంచారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.

పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10 కొనసాగనుంది. చమురు ధరలు పెరగడంతో డీజిల్ సెస్ అమలుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ప్రజలు సహకరించాలని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్​ కోరారు.

ఆర్టీసీలో ప్రతి రోజు 6 లక్షల లీలర్ల డీజిల్​ను వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఇటీవల కాలంలో చమురు ధరలు అమాంతంగా పెరగడంతో డీజిల్ సెస్ అమలు చేయాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. 2021 డిసెంబరులో రూ.85 ఉన్న డీజిల్​ ధర.. ప్రస్తుతం రూ.118 కి ఎగబాకడం.. ఒక్కసారిగా రూ.35 పెరిగిపోవడంతో డీజిల్ సెస్ పెంచాల్సి వచ్చిందని యాజమాన్యం వివరించింది.

ఇదిలావుంటే.. ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో రూ.5 చొప్పున, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు టికెట్‌ రేట్లను(Ticket prices) పెంచిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వస్తువుల ధరలు పెంచేస్తే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే రౌండప్‌ విధానాన్ని తీసుకొచ్చిన ఆర్టీసీ.. పల్లెవెలుగు బస్సు టికెట్‌ ధరల్లో దాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. చిల్లర సమస్య కారణంగా టికెట్‌ రేట్లను రౌండప్‌ చేసింది.

మరోవైపు.. హైదరాబాద్ సిటీ బస్సుల్లో బస్‌పాస్‌ ఛార్జీలను పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు (Charges) ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జనరల్‌ బస్‌ టికెట్‌ పాసుల కేటగిరిలో ఆర్డినరీ పాస్‌ (Ordinary Pass) చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌–ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది.

ఇవి కూడా చదవండి: Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..