Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..

వయసు పెరిగే కొద్దీ శరీరంలో రక్త హీనత ఏర్పడి.. అదే సమయంలో ముఖం ఛాయ కూడా పాలిపోవటం మొదలవుతుంది. కాబట్టి 40 ఏళ్లు పైబడిన స్త్రీలు ప్రతిరోజూ తప్పనిసరిగా దానిమ్మపండు తినాలి. దీని వల్ల శరీరంలో రక్తం పెరగడంతో

Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..
Pomegranate
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 08, 2022 | 1:57 PM

వయసు పెరిగే కొద్దీ శరీరంలో రక్త హీనత ఏర్పడి.. అదే సమయంలో ముఖం ఛాయ కూడా పాలిపోవటం మొదలవుతుంది. కాబట్టి 40 ఏళ్లు పైబడిన స్త్రీలు ప్రతిరోజూ తప్పనిసరిగా దానిమ్మపండు తినాలి. దీని వల్ల శరీరంలో రక్తం పెరగడంతో పాటు ముఖంలో మెరుపు కూడా వస్తుంది. దానిమ్మపండులో(Pomegranate) విటమిన్-సి, విటమిన్-బి, విటమిన్-కెతో సహా పండులో ఉన్న రిచ్ యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే.. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో దానిమ్మ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం..

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి- దానిమ్మ గింజల్లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి వాటికి శక్తివంతమైన రంగును ఇవ్వడమే కాకుండా ఆహారంలో యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఈ పండ్ల రసంలో దాదాపు ఏ ఇతర పండ్ల రసం కంటే అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

దానిమ్మ ప్రయోజనాలు-

కండరాల పునరుద్ధరణ- వయసు పెరుగుతున్న కొద్ది కండరాల పని కష్టతరంగా మారుతున్నట్లు మీకు అనిపించవచ్చు. వ్యాయామాల ద్వారా రికవరీ ఎక్కువ సమయం పడుతుంది. అయితే.. మంచి అనుభూతి కావాలంటే.. వ్యాయామం తర్వాత కండరాలు కోలుకోవడానికి దానిమ్మపండును తీసుకోండి. ఇది నొప్పిని తగ్గించడానికి, వ్యాయామం నుంచి కోలుకుని మీ శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన చర్మం- దానిమ్మ మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, పొడి,దురద నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. ఈ పండు మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. మీ చర్మం లోపల, వెలుపల నుంచి మెరుస్తూ ఉంటుంది.

జుట్టు పెరుగుదల- మీరు జుట్టు ఊడిపోతున్న సమస్యలతో బాధపడుతున్నారా అయితే మీకు దానిమ్మ సమస్యతో చెక్ పెట్టవచ్చు. ఈ పండు మీ జుట్టు మూలాలను అలాగే జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: Viral Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబు… దెయ్యంతో డ్యాన్సేంటి.. వీడియో చూస్తే షాక్

Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..