Health: కరోనా తర్వాత ఈ వ్యాధి ముదురుతోంది.. 20 నుంచి 30 సంవత్సరాలవారే బాధితులు..!

Health: దేశంలో కరోనా మహమ్మారి చివరి దశకి చేరింది. కానీ ఇది అనేక ఇతర వ్యాధులను పెంచింది. ప్రజల రోగనిరోధక శక్తిపై చాలా ప్రభావం చూపింది. దీనివల్ల చాలామంది గుండె, ఊపిరితిత్తులు,

Health: కరోనా తర్వాత ఈ వ్యాధి ముదురుతోంది.. 20 నుంచి 30 సంవత్సరాలవారే బాధితులు..!
Tuberculosis
Follow us
uppula Raju

|

Updated on: Apr 08, 2022 | 6:39 PM

Health: దేశంలో కరోనా మహమ్మారి చివరి దశకి చేరింది. కానీ ఇది అనేక ఇతర వ్యాధులను పెంచింది. ప్రజల రోగనిరోధక శక్తిపై చాలా ప్రభావం చూపింది. దీనివల్ల చాలామంది గుండె, ఊపిరితిత్తులు, మానసిక ఆరోగ్యం క్షీణించింది. కరోనా కారణంగా ఇప్పుడు క్షయవ్యాధి (టిబి) కేసులు కూడా పెరగడం ప్రారంభించాయి. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 20 నుంచి 30 శాతం పెరిగింది. ఆశ్యర్యకరంగా ఇందులో యువత ఎక్కువగా ఉంది. టీబీ రోగులు చాలా మంది ఆసుపత్రులకు వస్తున్నారు. వారి వయస్సు చాలా చిన్నది కానీ వారు టిబితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ వ్యాధి వారి ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలని కూడా దెబ్బతీస్తుంది. గతంలో యువతలో టీబీ కేసులు చాలా తక్కువ. కానీ ఇప్పుడు చిన్న వయస్సులోనే TB బారిన పడటం చూసి వైద్యులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ రోగులందరు మొదటగా మూడు వారాల కంటే ఎక్కువగా దగ్గుతో బాధపడుతున్నారు. అందరు సాధారణ ఫ్లూ అనుకుంటున్నారు. కానీ దగ్గు మాత్రం తగ్గడం లేదు. ఊపిరితిత్తులలో సమస్యలు మొదలవడంతో ఆస్పత్రికి వస్తున్నారు. ఇక్కడ పరీక్షలు చేసి చూడగా టీబీతో బాధపడుతున్నట్లు తేలుతోంది.

వాస్తవానికి కరోనా సమయంలో TB వ్యాధి తగ్గినట్లు అనిపించింది కానీ అది తగ్గలేదు. దీని కేసులు ఇప్పుడు నిరంతరం పెరుగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కోవిడ్ వల్ల చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనపడింది. ఈ కారణంగా వారు సులభంగా TB బారిన పడుతున్నారు. అంతేకాదు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు కూడా దగ్గును కొనసాగిస్తున్నారు. గత ఏడాది కాలంలో టీబీ రోగుల సంఖ్య 20 నుంచి 30 శాతం మేర పెరిగింది. కరోనా భయంతో ప్రజలు ఈ వ్యాధి చికిత్స కోసం బయటకు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉండడంతో చాలామంది ఆస్పత్రులకు వెళుతున్నారు.

TB అంటే ఏమిటి

మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ బ్యాక్టీరియా వల్ల టీబీ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. TB శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ప్రపంచంలో ప్రతిరోజూ 4100 మంది టిబి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా 1.22 కోట్ల మంది దీని బారిన పడుతున్నారు. ఈ వ్యాధి శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేస్తుంది. కరోనా తర్వాత TB రోగుల సమస్య పెరిగిందని WHO కూడా నమ్ముతోంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

IRCTC: ఒక్క రోజులో షిర్డీ సాయిబాబాను సందర్శించండి.. IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ..!

Viral Video: రెండు బెలూన్ల మధ్య ఆకాశంలో నడక.. సాహసం మామూలుగా లేదుగా..!

Ramadan 2022: ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే.. ఈ వ్యాధుల ప్రమాదం తక్కువ..!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!