AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: ఒక్క రోజులో షిర్డీ సాయిబాబాను సందర్శించండి.. IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ..!

IRCTC: వేసవి సెలవులని దృష్టిలో పెట్టుకొని IRCTC ఎప్పటికప్పుడు ప్రజల కోసం వివిధ రకాల టూర్ ప్యాకేజీలను తీసుకువస్తూనే ఉంది. ఈ ప్యాకేజీలతో తక్కువ ఖర్చుతో మీరు

IRCTC: ఒక్క రోజులో షిర్డీ సాయిబాబాను సందర్శించండి.. IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ..!
Shirdi Flight Package
uppula Raju
|

Updated on: Apr 08, 2022 | 6:19 PM

Share

IRCTC: వేసవి సెలవులని దృష్టిలో పెట్టుకొని IRCTC ఎప్పటికప్పుడు ప్రజల కోసం వివిధ రకాల టూర్ ప్యాకేజీలను తీసుకువస్తూనే ఉంది. ఈ ప్యాకేజీలతో తక్కువ ఖర్చుతో మీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సులభంగా పర్యటించవచ్చు. తాజాగా షిర్డీ సాయి భక్తుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీలో ప్రయాణికుడు బయలుదేరినప్పటి నుంచి బస చేయడానికి, ఆహారం, పానీయాలకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. మీకు సెలవులు లేనప్పటికీ ఈ ప్యాకేజీని వినియోగించుకోవచ్చు. ఎందుకంటే తక్కువ రోజులే కాబట్టి. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

IRCTC ఢిల్లీ టు షిర్డీ ప్రత్యేక ప్యాకేజీ లక్షణాలు

1. ఈ ప్యాకేజీలో ప్రయాణీకులు రాజధాని ఢిల్లీ నుంచి షిర్డీకి తరువాత షిర్డీ నుంచి ఢిల్లీకి వచ్చే సౌకర్యాన్ని పొందుతారు.

2. ఈ ప్యాకేజీలో మీరు షిర్డీలో పికప్, డ్రాప్ సౌకర్యం పొందుతారు.

3. ఈ ప్యాకేజీలో ప్రయాణికులందరికీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటి సౌకర్యాలు లభిస్తాయి.

4. మీరు ఫ్లైట్ దిగిన తర్వాత ప్రయాణించడానికి AC కారు సౌకర్యం కూడా లభిస్తుంది.

IRCTC ఈ ప్యాకేజీని రెండు రోజుల పాటు షెడ్యూల్ చేసింది. మొదటిది 23 ఏప్రిల్ 2022. రెండోది 14 మే 2022. ఈ ప్యాకేజీ ప్రకారం ఏప్రిల్ 23న విమానంలో ఢిల్లీ నుంచి షిర్డీకి చేరుకుంటారు. అనంతరం విలాసవంతమైన హోటల్‌లో బస చేస్తారు. మధ్యాహ్న భోజనం తరువాత శని శింగనాపూర్‌ని సందర్శించవచ్చు. సాయంత్రం తిరిగి వచ్చి హోటల్‌లో బస చేయవచ్చు. ఉదయం షిర్డీకి వెళ్లి దర్శనానంతరం భోజనం చేసి విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తారు. ఈ ప్యాకేజీలో భాగంగా సింగిల్ ప్యాసింజర్‌కి అయితే రూ. 16,970 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు ప్యాసింజర్లు అయితే ఒక్కో వ్యక్తికి రూ.15,960 చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురు ప్యాసింజర్లు అయితే ఒక్కో వ్యక్తి రూ.15,760 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజిని పొందేందుకు మీరు వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

Viral Video: రెండు బెలూన్ల మధ్య ఆకాశంలో నడక.. సాహసం మామూలుగా లేదుగా..!

Viral Video: ట్రాలీ నుంచి కిందపడబోయాడు.. కానీ కారు డ్రైవర్ దేవుడిలా వచ్చాడు..!

Kitchen vastu: వంటగది వాస్తు నియమాలు పాటించకపోతే ఇంట్లో ఈ అనర్థాలు తప్పవు..!