AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen vastu: వంటగది వాస్తు నియమాలు పాటించకపోతే ఇంట్లో ఈ అనర్థాలు తప్పవు..!

Kitchen vastu: ఇంట్లో వాస్తు దోషం ఉంటే కుటుంబ సభ్యుల అభివృద్ధి దెబ్బతింటుంది. ఆర్థిక సమస్యలు తెరపైకి వస్తాయి. అందువల్ల ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు

Kitchen vastu: వంటగది వాస్తు నియమాలు పాటించకపోతే ఇంట్లో ఈ అనర్థాలు తప్పవు..!
Vastu Tips
uppula Raju
|

Updated on: Apr 08, 2022 | 3:51 PM

Share

Kitchen vastu: ఇంట్లో వాస్తు దోషం ఉంటే కుటుంబ సభ్యుల అభివృద్ధి దెబ్బతింటుంది. ఆర్థిక సమస్యలు తెరపైకి వస్తాయి. అందువల్ల ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా వాస్తు నిపుణుడి సలహా తీసుకుంటే మంచిది. మీరు సొంత ఇంటిని నిర్మించుకోవాలంటే వంటగది వాస్తు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే తల్లి అన్నపూర్ణ వంటగదిలో నివసిస్తుంది. ఇక్కడ కుటుంబంలోని మహిళలు ఎక్కువ సమయం గడుపుతారు. ఈ పరిస్థితిలో ఇంట్లో వంటగదిని సిద్దం చేసేటప్పుడు వాస్తు నియమాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది కుటుంబం ఆరోగ్యం, విజయం, శ్రేయస్సుకు సంబంధించినది. వాస్తు ప్రకారం ఇంటి వంటగది ఎలా ఉండాలో తెలుసుకుందాం. వాస్తవానికి ఇంట్లో వంటగది ఆగ్నేయ భాగంలో ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుందని నమ్మకం. ఇంటి డిజైన్ ప్రకారం.. స్థలం తక్కువగా ఉంటే అప్పుడు వంటగదిని తూర్పు-మధ్య లేదా వాయువ్య దిశలో నిర్మించాలి. అలాగే వంటగది తలుపు తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. వంట చేసేటప్పుడు మహిళల ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా స్టవ్ అమర్చాలి. వంటగదిలో మిక్సర్, మైక్రోవేవ్ లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు ఆగ్నేయ దిశలో ఉంచితే మంచిది. తూర్పు, ఉత్తర దిశలో ఎక్కువ వస్తువులను ఉంచవద్దు. దీపాల ఏర్పాటు తూర్పు, ఉత్తర దిశలో ఉండాలి. విండో కూడా ఇదే దిశలో ఉండాలి. వంటగదిలో లేత రంగు పెయింట్ ఉంటే మంచిది.

ఏదైనా ఆహార పదార్థాలను వాయువ్య దిశలో ఉంచాలి. మహిళలు ఆహారం వండేటప్పుడు బయటి వ్యక్తులకి కనిపించకూడదు. ఇలా జరిగితే వంటగదిని పరదాతో కప్పివేయండి. డస్ట్‌బిన్‌ వాయువ్య దిశలో ఉండాలి. తడి, పొడి చెత్త కోసం వేర్వేరు డస్ట్‌బిన్‌లు ఉండాలి. ఎందుకంటే తల్లి అన్నపూర్ణ వంటగదిలో నివసిస్తుంది కాబట్టి అక్కడ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వంటగది వైపు వాషింగ్ మెషీన్ లేదా మరే ఇతర నీటి వస్తువులు ఉండకూడదు. వంటగదిలో ఆలయం కూడా ఉండకూడదు. నీరు, అగ్నికి సంబంధించిన వస్తువులను దూరంగా ఉంచాలి. వంటగదిలో ఏదైనా నీటి పాత్రను ఉంచినట్లయితే ఎల్లప్పుడు దానిని నింపి ఉంచాలి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం వాస్తు గ్రంథాల ఆధారంగా ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని ఉద్దేశించి రాయడం జరిగింది.

Viral Video: పెళ్లి కొడుకు స్నేహితుడే డబ్బులు నొక్కేస్తున్నాడు.. వీడియో చూస్తే షాక్..!

IPL 2022: రిషబ్‌ పంత్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు.. కెప్టెన్ అయ్యాక విఫలమవుతున్నాడు..!

Banana Peel Benefits: అరటి తొక్కలో అద్భుత గుణాలు.. వీటిని అస్సలు కోల్పోకండి..!