Banana Peel Benefits: అరటి తొక్కలో అద్భుత గుణాలు.. వీటిని అస్సలు కోల్పోకండి..!
Banana Peel Benefits: అరటి పండు అద్భుతమైన పండు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. భారతదేశంతో సహా చాలా దేశాల్లో అరటిపండ్లని తింటారు. కానీ మనదేశ ప్రజలకి
Banana Peel Benefits: అరటి పండు అద్భుతమైన పండు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. భారతదేశంతో సహా చాలా దేశాల్లో అరటిపండ్లని తింటారు. కానీ మనదేశ ప్రజలకి మాత్రమే అరటి తొక్క ఉపయోగం గురించి తెలుసు. అందుకే చాలామది అరటిపండుతో పాటు తొక్కని కూడా తినేస్తారు. అరటి పండు తియ్యగా ఉన్నప్పటికీ తొక్క మాత్రం చేదుగా ఉంటుంది. అయితే దీనిని తినడానికి రకరకాల పద్దతులు ఉన్నాయి. అరటి తొక్కని వేయించి తినవచ్చు. కాల్చి తినవచ్చు. స్మూతీలలో ఉపయోగించవచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. అరటి పండు ఎంత పండితే దాని తొక్క అంత తియ్యగా, సన్నగా మారుతుంది. ఇథిలీన్ అనే వాయువు వల్ల ఇది జరుగుతుంది.
అరటి తొక్కలోని పోషక ప్రయోజనాలు
అరటి తొక్కలో 12% ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. అరటి తొక్కలో విటమిన్ సి17% ఉంటుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థ బలపరుస్తుంది. ఇందులో విటమిన్ B-6 20% ఉంటుంది. ఇది శరీర సామర్థాన్ని పెంచుతుంది. 12% పొటాషియం ఉంటుంది. ఇది శరీరం అంతటా కణాలు, కణజాలాలు, అవయవాల అభివృద్ధికి సహాయపడుతుంది. 8% మెగ్నీషియం ఉంటుంది. ఇది శరీరం శక్తి ఉత్పత్తికి, గ్లూకోజ్, రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి పనిచేస్తుంది. మీరు అరటి పండుతో పాటు తొక్క కూడా తింటే ఈ పోషకాలన్ని డైరెక్ట్‌గా శరీరానికి లభిస్తాయి.
అరటి తొక్కతో ప్రత్యేకించి చర్మ సౌందర్యాన్నికాపాడుకోవచ్చు. అరటిపండు తొక్క, కొద్దిగా వంటసోడా, కాసిని నీళ్లు మిక్సీలో తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పూతలా రాసుకోవాలి. పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం పై మృత కణాలు తొలగిపోతాయి. ముఖచర్మం తాజాగా, కోమలంగా మారుతుంది. చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, ఒక అరటితొక్కను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి కాసేపాగి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంలో అధిక జిడ్డు వదులుతుంది. పాదాల పగుళ్ల నివారణకూ అరటి తొక్క ఉపయోగపడుతుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.