Agriculture News: రైతులకి మంచి బిజినెస్.. వీటి పెంపకంతో అదనపు ఆదాయం..!
Agriculture News: బాతుల పెంపకం అనేది చాలా తక్కువ మంది రైతులు చేస్తారు. ఇది కోళ్ల పెంపకం తర్వాతే వస్తుంది. వాస్తవానికి కోళ్ల కంటే బాతు పిల్లలను పెంచడం చాలా సులభం.
Duck Farming: బాతుల పెంపకం అనేది చాలా తక్కువ మంది రైతులు చేస్తారు. ఇది కోళ్ల పెంపకం తర్వాతే వస్తుంది. వాస్తవానికి కోళ్ల కంటే బాతు పిల్లలను పెంచడం చాలా సులభం. అంతేకాదు చాలా చౌక. ప్రస్తుతం చాలా మంది బాతుల పెంపకం వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణం. వరి సాగు, చేపల పెంపకం చేస్తున్న రైతులకు బాతుల పెంపకం అదనపు ఆదాయ వనరు. మీరు సరైన పద్ధతిలో బాతుల పెంపకం చేస్తే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. బాతు ఒక కఠినమైన జీవి ఏ వాతావరణంలోనైనా బతుకుంతుంది. ఈ కారణంగా వీటిని పెంచడం చాలా సులభం. కోళ్లతో పోలిస్తే వీటికి వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు బాతుల పెంపకంలో ముందంజలో ఉన్నాయి. బాతులు ధాన్యపు గింజలు, కీటకాలు, చిన్న చేపలు, కప్పలు, నీటిలో నివసించే కీటకాలని తింటాయి. వాటి ఆహారం కోసం ప్రత్యేక ఖర్చు ఉండదు.
బాతులు కోళ్ల కంటే 40 నుంచి 50 గుడ్లు ఎక్కువ పెడతాయ. గుడ్ల బరువు కూడా 15 నుంచి 20 గ్రాములు ఎక్కువగా ఉంటాయి. బాతులు ఉదయమే గుడ్లు పెడతాయి. దీంతో వాటిని సేకరించడం కూడా రైతులకు సులువవుతుంది. మీరు చేపల పెంపకం లేదా వ్యవసాయం చేస్తుంటే బాతులను పెంచడం చాలా సులభం. బాతు దుంపలు, చిన్న చిన్న చేపలు, వరిలో పెరిగే కీటకాలను తింటుంది. దీనివల్ల పంట నష్టం జరగకుండా చేస్తాయి. నది ఒడ్డున ఏడాది పొడవునా నీరు ఉంటుంది. పౌల్ట్రీని పెంచడం సాధ్యం కాదు కానీ బాతులను సులభంగా పెంచుకోవచ్చు. బాతులకి ఇంటి నుంచి పొలానికి వెళ్లడం పొలం నుంచి ఇంటికి రావడం నేర్పించవచ్చు. బాతులని పెంచడానికి తక్కువ స్థలం సరిపోతుంది. ఇండియన్ రన్నర్, కాంపాల్ వంటి కొన్ని రకాల బాతులు గుడ్లు అధికంగా పెడుతాయి. పెకింగ్, ముస్కోబి, ఎల్లిస్ బెర్రీ, రాయల్ కాగువా బాతులు మాంసానికి ప్రత్యేకం. ఖాకీ కాంప్‌బెల్ బాతు సంవత్సరానికి 300 గుడ్లు పెడుతుంది.