IPL 2022: రిషబ్‌ పంత్ నుంచి ‘సింగిల్‌ హ్యాండ్‌ సిక్స్‌’ నేర్చుకోవాలి.. 5000 పరుగులు చేసిన ఆటగాడి కోరిక..!

IPL 2022: ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. కెప్టెన్ రిషబ్ పంత్ దగ్గర ఒంటి చేత్తో సిక్స్‌ కొట్టడం ఎలాగో నేర్చుకోవాలనుకుంటున్నాడు.

IPL 2022: రిషబ్‌ పంత్ నుంచి 'సింగిల్‌ హ్యాండ్‌ సిక్స్‌' నేర్చుకోవాలి.. 5000 పరుగులు చేసిన ఆటగాడి కోరిక..!
David Warner
Follow us
uppula Raju

|

Updated on: Apr 07, 2022 | 2:45 PM

IPL 2022: ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. కెప్టెన్ రిషబ్ పంత్ దగ్గర ఒంటి చేత్తో సిక్స్‌ కొట్టడం ఎలాగో నేర్చుకోవాలనుకుంటున్నాడు. అలాంటి షాట్ల ద్వారా పంత్‌ చాలా పరుగులు చేస్తాడని మెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ రెండోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 2009లో వార్నర్ మొదటిసారిగా ఐపీఎల్‌లో ఆడాడు. ఇప్పుడు ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్‌తో జరిగే మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడు. అతను ప్లేయింగ్ XIలో చేరడం ఖాయం. పాకిస్థాన్-ఆస్ట్రేలియా సిరీస్ కారణంగా వార్నర్ ఇంకా IPL 2022లో ఆడలేదు. ఏప్రిల్ 6న డేవిడ్ వార్నర్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘నేను రిషబ్ నుంచి ఒంటి చేత్తో షాట్‌ ఆడటం నేర్చుకోవాలనుకుంటున్నాను. అతను యువ కెప్టెన్ అంతేకాకుండా భారత జట్టులో అంతర్భాగం. అతనితో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను’ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ‘రికీ పాంటింగ్‌కి ఢిల్లీతో అనుబంధం ఎక్కువ. అతను ఆస్ట్రేలియాకు విజయవంతమైన కెప్టెన్. ఇప్పుడు కోచ్‌గా కూడా గౌరవం పొందుతున్నాడు. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం అవుతుంది’

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు సంబంధించి వార్నర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో పూర్తి శక్తితో ఆడాల్సి ఉందన్నాడు. ఫీల్డింగ్ అనేది ఆటలో అతిపెద్ద భాగం. క్యాచ్‌లను అస్సలు మిస్ చేయకూడదు. అప్పుడే టోర్నమెంట్‌లో చాలా దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్. మొత్తం మీద ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడు. విదేశీ బ్యాట్స్‌మెన్‌లలో మొదటివాడు. 143 మ్యాచ్‌లు ఆడి 5286 పరుగులు చేశాడు. అతను ఇప్పటివరకు నాలుగు సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

Night Hair Care: ఆరోగ్యకరమైన జుట్టు కోసం రాత్రిపూట ఈ చిట్కాలు పాటించండి..

Astro News: దేవుడి ఎదుట పిండి దీపం వెలిగించండి.. ఇంట్లోని ఈ సమస్యలని తరిమికొట్టండి..!

IPL 2022: ‘చెన్నై కెప్టెన్‌ ఇప్పటికీ ధోనినే.. తలనొప్పిగా మారిన జడేజా’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వెటరన్ ప్లేయర్..!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..