IPL 2022: ‘నోటికాడి వడా పావ్ లాగేసుకున్నారు’.. హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పిచ్చిన సెహ్వాగ్ చమత్కార ట్వీట్..
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) తన చమత్కారంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు...
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) తన చమత్కారంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత సెహ్వాగ్ పాట్ కమిన్స్(Pat Cummins) గురించి ట్వీట్ చేశాడు. ముంబై ఇండియన్స్‌పై పాట్ కమిన్స్ 15 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. 373 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 19 నిమిషాల్లో కమిన్స్ సునామీ సృష్టించాడు. ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత, వీరేంద్ర సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశాడు. ” నోటి వడ పావ్‌ను లాగేసుకున్నట్లు ప్యాట్ కమిన్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను లాగేసుకున్నాడని ట్వీట్ చేశాడు. పాట్ కమ్మిన్స్, క్లీన్ హిట్టింగ్ అత్యంత అద్భుత ప్రదర్శనల్లో ఒటిగా నిలిస్తుందన్నారు. చివరగా రోహిత్ అభిమానుల కంటే అతని బ్యాటింగ్‌కి పెద్ద నేను అభిమాని అని చెప్పాడు.
ప్యాట్ కమిన్స్‌పై కోల్‌కత్తా జట్టు యజమాని షారుఖ్ ఖాన్‌తో పాటు పలువురు మాజీలు పొగడ్తల వర్షం కురిపించారు. మరోవైపు అభిమానులు, నెటిజన్లు మీమ్స్‌తో అలరిస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్‌తో పాటు ప్యాట్ కమిన్స్ నిలిచాడు. యూసుఫ్ పఠాన్, సునీల్ నరైన్ ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ ఐపీఎల్‌లో 15-15 బంతుల్లోనే అర్ధ సెంచరీలు సాధించారు. ఈ సీజన్‌లో కమిన్స్‌కు ఇది తొలి మ్యాచ్. అంతకుముందు అతను తన జాతీయ జట్టుతో కలిసి పాకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు. ఆపై షేన్ వార్న్ అంత్యక్రియలకు హాజరయ్యాడు. అతను ఒకటో తేదీన తిరిగి వచ్చి మూడు రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేశాడు. అయినప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల కారణంగా అతను ఏప్రిల్ 5లోపు ఆడలేకపోయాడు. కాగా ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌లో ఓడిపోయింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ కూడు హైట్రిక్ పరాజయాలను నమోదు చేసింది.
Moonh se nivala cheen liya ,, sorry vada pav cheen liya. Pat Cummins, one of the most insane display of clean hitting , 15 ball 56 … Jeera Batti #MIvKKR pic.twitter.com/Npi2TybgP9
— Virender Sehwag (@virendersehwag) April 6, 2022
Read Also.. IPL 2022: తుఫాన్ సృష్టించిన ప్యాట్ కమిన్స్.. 14 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసిన ఆసీస్ ఆటగాడు..