AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: రహానే ఎంటాయ్యా ఇది.. కీపర్ ఉండగా నువ్వేందుకు వచ్చావు.. వైరల్ అయిన వీడియో..

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా బుధవారం పూణేలోని మహారాష్ట్ర అసోసియేషన్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన పోరులో కోల్‌కత్తా విజయం సాధించింది...

IPL 2022: రహానే ఎంటాయ్యా ఇది.. కీపర్ ఉండగా నువ్వేందుకు వచ్చావు.. వైరల్ అయిన వీడియో..
Rahane
Srinivas Chekkilla
|

Updated on: Apr 07, 2022 | 8:54 AM

Share

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా బుధవారం పూణేలోని మహారాష్ట్ర అసోసియేషన్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన పోరులో కోల్‌కత్తా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. రహానే(Rahane) చేసిన పనికి ఎంటాయ్యా ఇది అనాల్సి వచ్చింది. క్యాచ్‌ను సులువుగా అందుకోవాల్సిన కీపర్‌ను కాదని తానే అందుకోవాలన్న తాపత్రయం రహానేను నిరాశ పరిచింది. క్యాచ్‌ మిస్‌ కావడంతో సోషల్ మీడియాలో రహానే నువ్వెందుకు మధ్యలో వచ్చావయ్యా! అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రహానే క్యాచ్‌ మిస్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ముంబై ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ ఉమేష్ యాదవ్‌(Umesh Yadav) వేశాడు. అప్పుడు క్రీజులో తిలక్‌వర్మ ఉన్నాడు. తొలి రెండు బంతులు సింగిల్స్‌ వచ్చాయి. మూడో బంతిని తిలక్‌ వర్మ గాల్లోకి లేపాడు. అయితే కీపర్‌ సామ్‌ బిల్లింగ్స్‌కు క్యాచ్‌ తీసుకునే అవకాశం వచ్చింది.

కానీ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ నుంచి రహానే వేగంగా పరిగెత్తుకొచ్చి మధ్యలో దూరాడు. బిల్లింగ్స్‌ రాకముందే రహానే అక్కడికి చేరుకొని క్యాచ్‌ అందుకునే ప్రయత్నంలో బాల్ విడిచిపెట్టాడు. దీంతో తిలక్‌ వర్మ బతికిపోయాడు. మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల అటు రహానే, బిల్లింగ్స్‌ ఇద్దరు క్యాచ్‌ను వదిలేశారు. కీపర్ సామ్ బిల్లింగ్స్ ఏంటయ్యా ఇది అనుకుంటూ వెనక్కు వెళ్లాడు. మధ్యలో వచ్చి క్యాచ్‌ను వదిలేసిన రహానేను చూసి ఏం అనాలో కేకేఆర్‌ ఆటగాళ్లకు అర్థంకాలేదు. అలా 2 పరుగుల వద్ద లైఫ్‌ పొందినతిలక్‌ వర్మ ఆ తర్వాత మరో 36 పరుగులు సాధించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కత్తా బౌలర్ ప్యాట్‌ కమిన్స్ మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలేట్‌గా నిలించింది. అతను 15 బంతుల్లో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఆరు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. వెంకటేశ్ అయ్యార్ 41 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో రహానే ఏడు పరుగులు మాత్రమే చేశాడు.

Read Also..  IPL 2022: తుఫాన్‌ సృష్టించిన ప్యాట్ కమిన్స్.. 14 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసిన ఆసీస్‌ ఆటగాడు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్