IPL 2022: తుఫాన్ సృష్టించిన ప్యాట్ కమిన్స్.. 14 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసిన ఆసీస్ ఆటగాడు..
Pat Cummins: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ( kolkata knight riders) పేలవంగా ఛేదన మొదలు పెట్టింది. 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు ఆదిలోనే వికెట్లు కోల్పోయింది...
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ( kolkata knight riders) పేలవంగా ఛేదన మొదలు పెట్టింది. 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకున్నా నైట్ రైడర్స్ మురగన్ అశ్విన్ రాకతో మళ్లీ వికెట్లు కోల్పోయింది. దీంతో 13 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయింది. అప్పుడు ముంబై విజయం ఖాయమనుకున్నారు. కానీ అప్పుడు వచ్చాడు..వచ్చి రాగానే బ్యాట్ ఝులిపించాడు ప్యాట్ కమ్మిన్స్(Pat Cummins). సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిపించాడు బౌలర్ ఎవరు అనేది చూడలేదు. ప్రతి బంతిని స్టాండ్‌లోకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీంతో 14 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసి ఐపీఎల్(IPL 2022) చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. యూసుఫ్ పఠాన్, సునీల్ నరైన్ ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ ఐపీఎల్‌లో 15-15 బంతుల్లోనే అర్ధ సెంచరీలు సాధించారు.
ఒకే ఓవర్‌లో 35 పరుగులు 14వ ఓవర్లో కమిన్స్ మైదానంలోకి దిగాడు. ఈ ఓవర్ ఐదో బంతికి టైమల్ మిల్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అతను చివరి బంతికి ఫోర్ బాదాడు. ఇక్కడి నుంచి కమిన్స్ భీకర బ్యాటింగ్ యుద్ధం మొదలైంది. కమ్మిన్స్ బుమ్రాను కూడా కమిన్స్ వదల్లేదు. బుమ్రా ఓవర్‌లో నాలుగు, ఐదో బంతుల్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. 16వ ఓవర్‌ను డేనియల్ సామ్స్ వేశాడు. తొలి బంతికే కమిన్స్ అద్భుత సిక్సర్ బాదాడు. తర్వాతి బంతికి ఫోర్ కొట్టాడు. మూడు, నాలుగో బంతుల్లో మరో రెండు సిక్సర్లు బాదాడు. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. అయితే ఇక్కడ కమిన్స్‌కు లైఫ్ వచ్చింది. కమిన్స్ కొట్టిన షాట్‌ను సూర్యకుమార్ అద్భుత క్యాచ్ పట్టాడు కానీ ఈ బంతి నో బాల్ అయింది. తర్వాతి బంతికి కమ్మిన్స్ ఫోర్ కొట్టి ఫిఫ్టీని పూర్తి చేసి చివరి బంతికి సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 35 పరుగులు పిండకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యంత ఖరీదైన ఓవర్.
ఈ సీజన్‌లో కమిన్స్‌కు ఇది తొలి మ్యాచ్. అంతకుముందు అతను తన జాతీయ జట్టుతో కలిసి పాకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు. ఆపై షేన్ వార్న్ అంత్యక్రియలకు హాజరయ్యాడు. అతను ఒకటో తేదీన తిరిగి వచ్చి మూడు రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేశాడు. అయినప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల కారణంగా అతను ఏప్రిల్ 5లోపు ఆడలేకపోయాడు. కాగా ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌లో ఓడిపోయింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ కూడు హైట్రిక్ పరాజయాలను నమోదు చేసింది.