IPL 2022 Points Table: ముచ్చటగా మూడో విజయంతో టాప్ ప్లేసులోకి కేకేఆర్.. పర్పుల్ క్యాప్ ఎవరి వద్ద ఉందంటే..
IPL 2022 Points Table: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ (MI vs KKR) తలపడ్డాయి.
IPL 2022 Points Table: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ (MI vs KKR) తలపడ్డాయి. ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ విధ్వసం కారణంగా కేకేఆర్ టోర్నీలో ముచ్చటగా మూడో విజయం నమోదు చేసుకోగా, రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుందిక కేకేఆర్. మొత్తం 6 పాయింట్లతో సాధించడంతో పాటు నెట్ రన్‌రేట్‌ను మెరుగుకుపర్చుకుంది. ఇక టోర్నీలో ఇప్పటివరకు విజయాల ఖాతా తెరవని రోహిత్ సేన తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్ ద్వారా ఆ జట్టు రన్ రేట్ కూడా భారీగా దెబ్బతింది.
అట్టడుగున హైద్రాబాద్..
కాగా ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో రాజస్థాన్ రాయల్స్ 2వ స్థానంలో ఉంది. ఇక హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ( రెండు విజయాలు) మూడో స్థానంలో, మయాంక్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ( రెండు విజయాలు, ఒక ఓటమి) నాలుగు, లక్నో సూపర్ జెయింట్స్ (రెండు విజయాలు, ఒక ఓటమి) ఐదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( రెండు విజయాలు, ఒక ఓటమి) ఆరోప్లేసులో, ఢిల్లీ క్యాపిటల్స్ ( ఒక గెలుపు, ఒక ఓటమి)ఏడో స్థానంలో, ఇక టోర్నీలో విజయాల ఖాతా తెరవని చెన్నై వరుసగా 8,9 వ స్థానాల్లో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టడుగు స్థానంలో ఉంది.
ఆరెంజ్ క్యాప్ రేసులో..
రాజస్థాన్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఈ జాబితాలో ముందున్నాడు. టోర్నీలో అతను ఇప్పటివరకు 143 స్ట్రైక్ రేట్‌తో 205 పరుగులు సాధించాడు. ఇందులో ఇక సెంచరీ, హాఫ్ సెంచరీ కూడా ఉంది. అంతేకాదు ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా బట్లర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీలు బాదిన ముంబై ఆటగాడు ఇషాన్.. కోల్ కతా బౌలర్ల ముందు నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 21 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో 149 పరుగులు చేసిన ఇషాన్ ఆరెంజ్ క్యాప్ రేసులో రెండోస్థానంలో ఉన్నాడు. బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ (122 పరుగులు) మూడు, ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మ (121పరుగులు) నాలుగు, లక్నో బ్యాటర్ దీపక్ హుడా (119 రన్స్) తో ఐదో స్థానంలో ఉన్నారు.
పర్పుల్ క్యాప్ రేసులో..
ఇక టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌కు అందించే పర్పుల్ క్యాప్ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తోన్న అతను ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. ఇక రాజస్థాన్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (7వికెట్లు) రెండో స్థానంలో, లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ (7 వికెట్లు) మూడో ప్లేసులో ఉన్నారు. ఇక మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లతో రాహుల్ చాహర్ నాలుగు, బెంగళూరు బౌలర్ వసిందు హసరంగా (6 వికెట్లు) ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు.
Crime news: కెమెరాకు చిక్కిన మాదన్నపేట్ రెడ్డి సంఘం అధ్యక్షుడు.. అర్ధరాత్రి సమయంలో ఆ పనులు
Russia Ukraine War: రష్యాపై అమెరికా మరో ఎత్తుగడ.. UNHRC నుంచి బయటకు పంపేందుకు ప్లాన్..