AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs MI, IPL 2022: కమిన్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌లో ముంబై గల్లంతు.. ఐదు వికెట్ల తేడాతో ఓడిన రోహిత్ సేన..

KKR vs MI, IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్‌ ప్యాట్ కమ్మిన్స్ మెరుపు ఇన్నింగ్స్ తో ఐపీఎల్‌ టోర్నీలో ముంబై ఇండియన్స్‌ (MI) జట్టు మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది.

KKR vs MI, IPL 2022: కమిన్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌లో ముంబై గల్లంతు.. ఐదు వికెట్ల తేడాతో ఓడిన రోహిత్ సేన..
Pat Cummins
Basha Shek
|

Updated on: Apr 07, 2022 | 12:24 AM

Share

KKR vs MI, IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్‌ ప్యాట్ కమ్మిన్స్ మెరుపు ఇన్నింగ్స్ తో ఐపీఎల్‌ టోర్నీలో ముంబై ఇండియన్స్‌ (MI) జట్టు మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌ ఆడుతున్న కమిన్స్‌ అటు బంతితోనూ, అటు బ్యాట్‌ తోనూ రాణించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR)కు ముచ్చటగా మూడో విజయాన్ని అందించాడు. కాగా ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన కమిన్స్ ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్‌సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రపుటల్లోకి ఎక్కాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్‌ డానియెల్‌ సామ్స్‌కు చుక్కలు చూపించాడు ఈ ఆసీస్‌ కెప్టెన్‌. సామ్స్‌ వేసిన 16 ఓవర్‌ లో ఏకంగా 4 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టి మొత్తం మీద 35 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆ ఓవర్లోనే కోల్‌కతా విజయం ఖరారైపోయింది. ముంబై విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ అగ్రస్థానానికి చేరుకుంది. హ్యాట్రిక్‌ పరాజయాలు పొందిన ముంబై తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు విజయాన్ని అందించిన కమిన్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఒకే ఓవర్‌లోనే..

కాగా ఈ మ్యాచ్‌లో ముంబై విధించిన లక్ష్యం మరీ పెద్దదేమీ కాదు. అయితే గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే, ముంబై బౌలర్లు ఈసారి ప్రారంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. వీరి ధాటికి కేకేఆర్‌ మొదటి 4 ఓవర్లలో కేవలం14 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఒత్తిడికి గురైన ఓపెనర్ అజింక్యా రహానె భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వచ్చిన వెంటనే రెండు ఫోర్లు బాదినా.. రహానెలా షార్ట్ బాల్‌కే వెనుదిరిగాడు. ఆ తర్వాత సామ్ బిల్లింగ్స్, వెంకటేష్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొన్ని బౌండరీలతో స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో బిల్లింగ్స్‌ పెవిలియన్‌ చేరుకున్నాడు. కాగా 10వ ఓవర్ల ముగిసే సరికి 87/3 తో మంచి స్థితిలోనే ఉన్న శ్రేయస్‌ సేన ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. కేవలం10 బంతుల తేడాలో నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ పెవిలియన్ బాట పట్టడంతో కష్టాల్లో పడింది. అయితే ప్యా్‌ కమిన్స్‌ రాకతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగడంతో మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షమైపోయింది.

అర్ధసెంచరీతో ఆదుకున్న సూర్య..

అంతకుముందు కోల్‌కతా ఉమేష్ యాదవ్ పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఉమేశ్ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసిన 18 ఏళ్ల దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డెవాల్డ్ బ్రెవిస్‌ (బేబీ డివీలియర్స్‌) క్రీజులోకి రాగానే దూకుడు చూపించాడు. అద్భుతమైన షాట్లు కొట్టి ముంబై స్కోర్‌ ను పెంచాడు. 19 బంతుల్లో 29 పరుగులు చేసిన అతను చక్రవర్తి బౌలింగ్‌ లో స్టంపౌట్‌ అయ్యాడు. కాగా తొలి 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో అర్ధ సెంచరీలు సాధించిన ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 14) మరీ నిదానంగా ఆడాడు. గాయం తర్వాత పునరాగమనం చేసిన సూర్యకుమార్ క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్నాడు. దీంతో స్కోరు మందగించింది. కాగా ఉమేష్ యాదవ్ వేసిన చివరి ఓవర్‌లో తిలక్ వర్మ ఇచ్చిన క్యాచ్‌ను అజింక్యా వదిలేశాడు. దీనికి ముంబై భారీ మూల్యమే చెల్లించుకుంది. అప్పుడు తిలక్ కేవలం మూడు పరుగులతో ఉన్నాడు. ఇక సూర్య-తిలక్ నాలుగో వికెట్‌కు 83 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా 36 బంతుల్లో 52 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన సూర్య కమిన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన పొలార్డ్‌ ఐదు బంతుల్లో 22 పరుగులు చేయడంతో ముంబై మెరుగైన స్కోరు సాధించింది. కాగా జట్టుకు ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌ ఆడిన తిలక్‌ వర్మ 27 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు.

Also Read: Russia Ukraine War: రష్యాపై అమెరికా మరో ఎత్తుగడ.. UNHRC నుంచి బయటకు పంపేందుకు ప్లాన్..

IPL 2022: కీలక ఆటగాళ్ల రాకతో రెట్టింపైన ఢిల్లీ బలం.. పటిష్టంగానే కేఎల్ రాహుల్ సేన.. హోరీహోరీ తప్పదా?

LSG vs DC Playing XI IPL 2022: వార్నర్ వచ్చేశాడోచ్.. లక్నో‌తో పోరుకు సిద్ధమైన ఢిల్లీ.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?