Russia Ukraine War: రష్యాపై అమెరికా మరో ఎత్తుగడ.. UNHRC నుంచి బయటకు పంపేందుకు ప్లాన్..
ఉక్రెయిన్‌పై మళ్లీ పవర్‌ఫుల్ సూపర్ సోనిక్ మిస్సైళ్లను ప్రయోగించింది రష్యా. చర్చల ప్రక్రియ నిలిపివేయడానికి ఉక్రెయిన్ జెలెన్‌స్కీ కొత్త కుట్రలకు తెరతీస్తున్నారని రష్యా ఆరోపించింది. UNHRC నుంచి..
ఉక్రెయిన్‌పై మళ్లీ పవర్‌ఫుల్ సూపర్ సోనిక్ మిస్సైళ్లను ప్రయోగించింది రష్యా. చర్చల ప్రక్రియ నిలిపివేయడానికి ఉక్రెయిన్ జెలెన్‌స్కీ కొత్త కుట్రలకు తెరతీస్తున్నారని రష్యా ఆరోపించింది. UNHRC నుంచి రష్యాను బయటకు పంపేందుకు గురువారం ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్ జరుగుతుంది. ఉక్రెయిన్‌పై వరుసగా 42వ రోజు కూడా రష్యా దాడులు(Russia Ukraine War) కొనసాగుతున్నాయి. బ్లాక్‌సీ నుంచి తాజాగా రష్యా సూపర్ సోనిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. రష్యా దాడుల్లో రెండు ఉక్రెయిన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. బుచాలో మారణహోమం పేరుతో ఉక్రెయిన్ తప్పుడు ప్రచారం చేస్తోందని రష్యా విదేశాంగశాఖ మంత్రి లవరోవ్ ఆరోపించారు. చర్చల ప్రక్రియ ఆగిపోయేలా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కుట్ర చేశారని లవరోవ్ అన్నారు. యుద్దం ఆగాలంటే ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరించాల్సిందేనని అన్నారు లవరోవ్. తమ షరతులు ఉక్రెయిన్‌కు తెలుసని అన్నారు.
రష్యా దాడుల్లో కీవ్ సమీపం లోని హోస్టొమల్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసమయ్యింది. ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్‌బేస్‌గా హోస్టొమల్‌కు పేరుంది. కీవ్ , చెర్నివ్ నగరాలను విడిచివెళ్లిన రష్యా బలగాలు తాజాగా ఖార్కీవ్ నగరంపై దృష్టి పెట్టినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ వెల్లడించింది. కీవ్‌లో నరమేథం సృష్టించిన బలగాలనే ఖార్కీవ్ వైపు పుతిన్ పంపిస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపించింది.
యూఎన్ మానవహక్కుల కమిషన్‌లో రష్యా సభ్యత్వం తొలగింపుపై ఐక్యరాజ్యసమితిలో గురువారం ఓటింగ్ జరుగుతుంది. బుచాలో రష్యా మారణహోమానికి పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
డాన్‌బాస్‌తో పాటు క్రిమియాపై తమ హక్కులు వదులుకునేది లేదన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. రష్యాతో అమీతుమీకి సిద్దమన్నారు. యుద్దనేరాలకు పాల్పడ్డ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను శిక్షించాలని మరోసారి జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. అసలు అంతర్జాతీయ చట్టానికి విలువుందా ? అని ప్రశ్నించారు.
మరియాపోల్ నగరాన్ని రష్యా బలగాలు విడిచిపెట్టడం లేదు. రష్యా దాడుల్లో మరియాపోల్ లోని అన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ఇంకా లక్ష మంది ప్రజలు మరియాపోల్‌లో చిక్కుకున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది.
ఇవి కూడా చదవండి: MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ అరెస్ట్.. మంత్రి కేటీఆర్ సూచనతో స్పందించిన పోలీసులు
Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన..
Optical Illusion: ఈ ఫోటోలో ఏముందో గుర్తించండి.. మొదటగా కనిపించేదే మీ బలం..