Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన.

Telangana University: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో క్యాంటీన్‌ భోజనంలో విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, భోజనంలో మొన్న సాలెపురుగు, నిన్న బొద్దింక కనిపించగా.. నేడు తెలంగాణ యూనివర్సిటీలో కప్ప వచ్చింది.

Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన.
Frog In Breakfast
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 06, 2022 | 4:02 PM

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో(Basara IIIT Campus) క్యాంటీన్‌ భోజనంలో విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, భోజనంలో మొన్న సాలెపురుగు, నిన్న బొద్దింక కనిపించగా.. నేడు తెలంగాణ యూనివర్సిటీలో(Telangana University) కప్ప వచ్చింది. ఈ ఘటనను మరిచిపోక ముందే తెలంగాణ యూనివర్సిటీలోని మహిళ వసతి గృహంలో ఉదయం అల్పాహారం లో కప్పా రావడంతో విద్యార్థినిలు ఆందోళన వ్యక్తం చేసారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం తెలంగాణ వర్షిటీలో ఇలా కప్ప రావడంతో విసీ ఛాంబర్ ఎదుట విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని పి.డి.ఎస్.యు నాయకులు వర్సిటీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని వర్శిటీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులతో అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేయటం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఈ రోజు వర్సిటీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వలన టిఫిన్ లో కప్ప రావటం జారిందన్నారు. జరిగిన ఘటనకు బాద్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 450 మంది విద్యార్థులకు ఓకే గర్ల్స్ హాస్టల్ సరిపోవడం లేదని అదనంగా మరొక గర్ల్స్ హాస్టల్ ను నిర్మించాలని డిమాండ్ చేశారు.

వర్సిటీలో కోతులు, పాములతో ఇబ్బందిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వలన క్లాసులకి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. హాస్టల్స్ లో అదనంగా వేయిటర్స్ ను నియమించాలని, వాటర్, వైఫై సమస్యను పరిష్కరించాలని వీసీకి వినతి పత్రం సమర్పించారు.

గత నెలలో.. నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో మెస్‌ నిర్వహణ తీరు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులకు అందించే బ్రేక్‌ ఫాస్ట్, భోజనంలో కప్ప, బొద్దింక సాలెపురుగు కనిపించింది. మూడు రోజులుగా విద్యార్థులకు కలుషిత ఆహారం సర్వ్‌ చేయడంపై విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తం అయ్యింది. మొదటిరోజు ఆలూ కూర్మతో కప్పను, రెండో రోజు పప్పుసాంబారుతో బొద్దింకలని వడ్డించారు శక్తి మెస్‌ నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి: Viral Video: పిల్లలపై కన్ను.. గద్దను చీల్చిచెండాడిన కోడి.. వీడియో చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే..

PMGKAY: కడు పేదరికం వృద్ధికి ముకుతాడు.. కేంద్ర ఆహార భద్రత పథకానికి IMF ప్రశంసలు..