AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Chilli Prices: పసిడిని క్రాస్ చేసిన ఎర్ర బంగారం.. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి ధరకు దేశీ రకం మిర్చి

Red Chilli Prices: పసిడి ధరను క్రాస్‌ చేసింది ఎర్ర బంగారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్పెషల్‌ అయిన దేశీ రకం మిర్చికి ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ ధర పలికింది.

Red Chilli Prices: పసిడిని క్రాస్ చేసిన ఎర్ర బంగారం.. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి ధరకు దేశీ రకం మిర్చి
Today Mirchi Price
Janardhan Veluru
|

Updated on: Apr 06, 2022 | 3:28 PM

Share

Enumamula Agriculture Market Yard: పసిడి ధరను క్రాస్‌ చేసింది ఎర్ర బంగారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్పెషల్‌ అయిన దేశీ రకం మిర్చికి ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ ధర పలికింది. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన ఎనుమాముల మార్కెట్‌లో ఈ దేశీ రకం మిర్చికి క్వింటాల్‌కు రూ.55, 551 లు లభించింది. ఒక తులం బంగారం కంటే.. క్వింటాల్ దేశీ రకం మిర్చి ఎక్కువ ధర పలకడం విశేషం.  ఎనుమాముల మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇప్పటి దాకా ఇదే హయ్యస్ట్‌ ధర కావడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఎక్కడా మిర్చికి ఈ ధర లేదని చెబుతున్నారు. దీన్ని బట్టి మిర్చికి డిమాండ్‌ ఎలా పెరిగింది, ధరలు ఎలా ఎగబాకుతున్నాయో అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎనుమాముల మార్కెట్‌లో పలికిన గరిష్ఠ ధర క్వింటాల్‌కు 21 వేల రూపాయలు మాత్రమే. ఇప్పుడు రెండున్నర రెట్లు పెరిగి రికార్డులు బ్రేక్‌ చేసింది.

దేశీ రకం మిర్చి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాత్రమే సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో ఎర్రమట్టి నెలల్లోనే దేశీ మిర్చి పండుతుంది. అయితే దేశీ మిర్చి సాగు కత్తి మీద సామే. ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. మిర్చి తోటలను పసిపిల్లల్ని సాకినట్టు కంటికి రెప్పలా కాపాడాలి. గట్టిగా ఒక్క వాన పడితే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈసారి కూడా పంట చేతికొచ్చే సమయంలో టైమ్‌లో అకాల వర్షం వల్ల రైతులు నష్టపోయారు. దిగుబడి పడిపోయింది. అయితే రికార్డు ధర పలకడంతో నష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ఏమైనా ఇక్కడ ఎర్రమట్టి నెలల్లో పండిన ఎర్రబంగారం ఆల్‌ టైమ్‌ రికార్డు ధరతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read..

AP: వ్యాన్ బోల్తా.. పరుగులు తీసిన డ్రైవర్.. పోలీసులు తికమక.. స్పాట్‌లో చెక్ చేయగా

Telangana Jobs 2022: తెలంగాణ గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్‌ కూడా! వెంటనే దరఖాస్తు..