Telangana Jobs 2022: తెలంగాణ గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్‌ కూడా! వెంటనే దరఖాస్తు..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న వేళ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. ఈ క్రమంలో ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar) రిజిస్ట్రేషన్ల..

Telangana Jobs 2022: తెలంగాణ గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్‌ కూడా! వెంటనే దరఖాస్తు..
Free Coaching Classes
Follow us
Srilakshmi C

| Edited By: Anil kumar poka

Updated on: Apr 06, 2022 | 2:41 PM

Free Coaching classes for TS Group 1 and 2 aspirants: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న వేళ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. ఈ క్రమంలో ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. వార్షిక ఆదాయం రూ.5లక్షల్లోపు ఉన్నవారు ఇవాళ్టి నుంచి ఏప్రిల 16 లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెల 16న ఆన్‌లైన్‌లో ఎంపిక పరీక్ష నిర్వహించి 21 నుంచి 1,25,000 మందికి ఉచిత శిక్షణ తరగతులను (Free Training) ప్రారంభిస్తామని చెప్పారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 రాసే 10వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గ్రూప్‌-1 అభ్యర్థులకు 6నెలల పాటు నెలకు రూ.5వేలు, గ్రూప్‌-2 అభ్యర్థులకు మూడు నెలల పాటు నెలకు రూ.2వేలు, ఎస్‌ఐ అభ్యర్థులకు నెలకు రూ.2వేల స్టైఫండ్‌ ఇచ్చేందుకు నిర్ణయించామని గంగుల కమలాకర్‌ ప్రకటించారు.

Also Read:

Deaf and Blind Baby: ఎంతో కాలం తర్వాత మొదటిసారిగా తల్లి స్వరాన్ని విన్న ఈ పాప ఎక్స్‌ప్రెషన్ చూస్తే.. మీ కళ్లు చెమ్మగిల్లుతాయి!