Deaf and Blind Baby: ఎంతో కాలం తర్వాత మొదటిసారిగా తల్లి స్వరాన్ని విన్న ఈ పాప ఎక్స్‌ప్రెషన్ చూస్తే.. మీ కళ్లు చెమ్మగిల్లుతాయి!
పుట్టుకతోనే వినే, చూసే సామర్థ్యం లేని పసిపాపకు దేవుడు వరం ఇచ్చినట్లు హఠాత్తుగా వినిపించడం ప్రారంభమైతే.. ఊహ బాగానే ఉంది కానీ నిజంగా ఇలలో ఇది సాధ్యమౌతుందా? అనే కదా అనుకుంటున్నారు. ఈ వీడియో ఓసారి చూడండి..
Hearing-impaired Baby Hears For the First Time, His Reaction Will Move You to Tears: కొంత మంది పిల్లలు పుట్టుకతోనే కొన్ని లోపాలతో పుడతారు. అటువంటి వారిలో కొందరికి వినే, చూసే సామర్థ్యం కూడా ఆస్సలుండదు. ఐతే ఆ పసిపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో? వాళ్లకు ఏమౌతుందో ఎదుటివారికి అర్థం కాదు. అంత చిన్న బిడ్డలు నోరు తెరిచి చెప్పలేరు. ఇక వారి పరిస్థితి తలచుకుంటేనే గుండె బరువెక్కుతుంది కదా? ఐతే ఇటువంటి వారికి దేవుడు వరం ఇచ్చినట్లు హఠాత్తుగా వినిపించడం ప్రారంభమైతే.. ఊహ బాగానే ఉంది కానీ నిజంగా ఇలలో ఇది సాధ్యమౌతుందా? అనే కదా అనుకుంటున్నారు. ఈ వీడియో ఓసారి చూడండి..
జాక్ అనే పాప పరిస్థితి కూడా సరిగ్గా ఈ విధమైనదే. ఐతే ఈ చిన్నారి తొలిసారిగా వినడం ప్రారంభినప్పుడు.. పాప ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఖచ్చితంగా భావోధ్వేగానికి గురవుతారు. ఈ పాపకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బోన్ యాంకర్డ్ హియరింగ్ ఎయిడ్ (BAHA device) అనే వినికిడి పరికరంతోనే ఇది సాధ్యపడింది. ఇది తాత్కాలిక పరిష్కారమైనప్పటికీ పాపకు వినికిడి తెప్పించడానికి డాక్టర్లు ఈ పద్ధతిని ఎంచుకున్నారు. ఈ వీడియోలో ఒక మహిళ చేతుల్లో ఉన్న జాక్ పాప తలకు వినికిడి పరికరాన్ని డాక్టర్లు అమర్చారు. మహిళ మాట్లాడుతున్నప్పుడు.. స్వరం వినిపించిన వైపుకు తలను తిప్పుతూ ప్రతిస్పందించడం వీడియోలో కనిపిస్తుంది. ఐతే ముద్దులొలకబోస్తున్న చందమామలాంటి ఈ పసి పాపకు వినికిడిలోపంతోపాటు కంటి చూపు కూడా లేదు.
పూర్తిగా వినికిడి శక్తి లేకపోవడంతో ఒక్కసారిగి పాప చెవులకు మాటలు వినిపించడంతో.. ఎటువైపు వినిపిస్తే ఆ వైపుకు సంబరంతో తలను తిప్పుతూ చూడటం వీక్షకులకు కంటనీరు తెప్పిస్తోందని వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూంపంలో తెలియజేస్తున్నారు. ‘దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడని’ ఒకరు, ‘టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానని’ మరొకరు.. ఇలా ఇప్పటికే ఈ వీడియోకు భిన్న కామెంట్లు, వేలల్లో వీక్షణలు, లైకులు రావడంతో సామాజిక మాధ్యమాల్లో జాక్‌పాప వీడియో వైరలయ్యింది.
View this post on Instagram
Also Read: