AP: వ్యాన్ బోల్తా.. పరుగులు తీసిన డ్రైవర్.. పోలీసులు తికమక.. స్పాట్‌లో చెక్ చేయగా

గంజాయి స్మగ్లింగ్ చేసే మెయిన్ వ్యక్తులు దొరకడం లేదు. మధ్యలో డబ్బులకు ఆశపడి రవాణా చేసే వ్యక్తులను అసలైన స్మగ్లర్స్ పావులుగా వాడుకుంటున్నారు.

AP: వ్యాన్ బోల్తా.. పరుగులు తీసిన డ్రైవర్.. పోలీసులు తికమక.. స్పాట్‌లో చెక్ చేయగా
Van Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 06, 2022 | 1:49 PM

ఆంధ్రప్రదేశ్ గంజాయి సాగు, రవాణాపై చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఓ వైపు గంజాయి తోటల ధ్వంసం కొనసాగుతుంటే… మరోవైపు గంజాయి రవాణా చేసే ముఠాలు వెనక్కి తగ్గడం లేదు. ఏజెన్సీ నుంచి వచ్చే ఏ వస్తువునైనా అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంది. కఠిన చర్యలు తీసుకుంటున్నా కేటుగాళ్లు మత్తు రవాణా ఆపడం లేదు. తాజాగా విశాఖ(Vizag)లో జరిగిన రోడ్డు ప్రమాదం భారీగా గంజాయి స్మగ్లింగ్ గుట్టు బయటపెట్టింది. ఆనందపురం మండలం(anandapuram mandal) నీళ్ల కుండీలు జంక్షన్ సమీపంలో ఆగి వున్న వ్యాన్‌ను మరో వ్యాన్ అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో ఆగివున్న వ్యాన్ బోల్తా పడింది. బోల్తా పడిన వ్యాన్‌లో అనూహ్య రీతిలో 57 బస్తాల్లో 2280 కిలోల గంజాయి బయటపడింది. ఆ వాహనం నెంబర్లు ప్లేట్‌ను తొలగించడంతో ఇంజిన్, చాసి నెంబర్లు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అసలు నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. పట్టుబడిన గంజాయి(Ganja) విలువ 2కోట్లు పైనే ఉంటుందని అంచనా. గంజాయి వ్యాన్ వివరాల కోసం రవాణాశాఖ అధికారుల సహకారం తీసుకుంటున్నారు పోలీసులు. ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలానికి చెందిన నానీబాబు పేరుపై వాహనం రిజిస్టర్ అయినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

కాగా గంజాయి స్మగ్లింగ్ చేసే మెయిన్ వ్యక్తులు దొరకడం లేదు. మధ్యలో డబ్బులకు ఆశపడి రవాణా చేసే వ్యక్తులను అసలైన స్మగ్లర్స్ పావులుగా వాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో దాడుల్లో దొరకుతోన్న గంజాయి చూస్తుంటే.. యువత ఏ రేంజ్‌లో మత్తుకు అలవాటుపడ్డారో అర్థమవుతోంది.

Also Read: Nandyala: చిన్న కాకి, పెద్ద నష్టం మిగిల్చింది.. ఆ కథా కమామిషు మీ కోసం…

AP: సర్పంచ్ సారూ ఇదేం పనండి.. చివరికి ముసుగు వేసుకోవాల్సి వచ్చిందిగా

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!