AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandyala: చిన్న కాకి, పెద్ద నష్టం మిగిల్చింది.. ఆ కథా కమామిషు మీ కోసం…

కాకి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ కాకి చేసిన నష్టం ఏందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Nandyala: చిన్న కాకి, పెద్ద నష్టం మిగిల్చింది.. ఆ కథా కమామిషు మీ కోసం...
Crow
Ram Naramaneni
|

Updated on: Apr 06, 2022 | 1:28 PM

Share

Andhra Pradesh: కాకే కదా అని తీసిపారేయకండి. కాకి తలుచుకుంటే ఎంత నష్టం చేయగలదో ఊహించుకుంటేనే భయమేస్తుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన సబ్ కలెక్టర్ బంగ్లా 20 ఏళ్లుగా మూతబడింది అంటే దానికి కారణం కాకి. అవును.. కాకి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ కాకి చేసిన నష్టం ఏందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఈ నెల 4న కొత్తగా నంద్యాల జిల్లా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేయడానికి బిల్డింగుల కొరత విపరీతంగా ఉంది. లక్షలకు లక్షలు అద్దెలు చెల్లించాల్సి వస్తుంది. కాగా ఇక్కడే బ్రిటిష్ హయాంలో నిర్మించబడిన చారిత్రాత్మక సబ్ కలెక్టర్ బంగ్లా వృథాగా ఉంది. మంత్రి సహా అఖిల భారత సర్వీసు అధికారులు ఆ బంగ్లాను చూసి స్వయంగా పరిశీలించి ఎందుకులే అని వదిలేసారు. అఖిల భారత సర్వీసు అధికారులు కూడా మూఢనమ్మకాల పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నారు అనేదానికి ఇది నిదర్శనం.

1897లో నంద్యాలలో సువిశాల విస్తీర్ణంలో సబ్ కలెక్టర్ బంగ్లా నిర్మాణమైంది. జనావాసాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో బంగ్లాను నిర్మించారు. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం బంగ్లాలోకి కాకి దూరింది. అప్పటి నుంచి అరిష్టంగా భావిస్తూ వస్తున్న అధికారులు బంగ్లాలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో బంగ్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపరిచారు. రెండుసార్లు దొంగతనం జరిగింది. కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో కిటికీలకు, వాకిళ్ళకు కాంక్రీట్ వేశారు. గాలి కూడా లోపలికి పోని విధంగా అరుంధతి సినిమాలో లాగా సీజ్ చేశారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పుడు బిల్డింగ్‌ల అవసరం కావడంతో సబ్ కలెక్టర్ బంగ్లాను కూడా మంత్రి, కలెక్టర్ , ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. కేవలం పది లక్షల ఖర్చు పెడితే అది… రాజుగారి బంగ్లాగా తయారవుతుంది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు… లక్షలకు లక్షలు అద్దెలు చెల్లించి ప్రైవేట్ భవంతుల్లో కార్యాలయాలు నడుపుతున్నారు. సబ్ కలెక్టర్ బంగ్లా ఆవరణ అంతా కంప, చెట్లు మొలిచాయి. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రమైంది. రాత్రి అయితే వ్యభిచారం కూడా జరుగుతుంది అనేది స్థానికుల వెర్షన్. మరి ఈ కథనం తర్వాత అయినా అధికారులు స్పందిస్తారో, లేదో చూడాలి.

Govt Building

నాగిరెడ్డి, టీవీ9 ప్రతినిధి

Also Read: Telangana: మందు ఎక్కువైంది.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే..