Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మందు ఎక్కువైంది.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే..

వారికి మందు మత్తుతో పాటు పైత్యం కూడా ఎక్కువైంది. దీంతో బుర్రల్లోకి ఓ పిచ్చి ఆలోచన వచ్చింది. పెళ్లి చేసుకున్నారు.  ఒకరి మెడలో ఇంకొకరు తాళి కట్టారు.

Telangana: మందు ఎక్కువైంది.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే..
Two Men Married
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 06, 2022 | 11:52 AM

వారికి మందు మత్తుతో పాటు పైత్యం కూడా ఎక్కువైంది. దీంతో బుర్రల్లోకి ఓ పిచ్చి ఆలోచన వచ్చింది. పెళ్లి చేసుకున్నారు.  ఒకరి మెడలో ఇంకొకరు తాళి కట్టారు. అరె.. పెళ్లి చేసుకోవడం తప్పు ఎలా అవుతుందనేగా మీ ప్రశ్న. పెళ్లి చేసుకుంది ఇద్దరు మగాళ్లు. అవునండీ బాబు.. ఈ యవ్వారం ఇక్కడితో ఆగలేదు.. తాళి కట్టించుకున్న యువకుడు.. కట్టిన వ్యక్తి ఇంటికి వెళ్లాడు. కాపురానికి వచ్చానని వయ్యారాలు పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు, అక్కడి స్థానికులు నిర్ఘాంతపోయారు. తాళి కట్టిన వ్యక్తి తల్లిదండ్రులు మందలించి అతడిని పంపించారు. దీంతో ఆ యువకుడు హర్టయ్యాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. పోలీసులు కూడా ఇదేం కేసురా బాబు అనుకుంటూ.. తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేసుకున్నారు. ఆపై తనకు నష్టపరిహారంగా  రూ.లక్ష ఇస్తే కానీ కంప్లైంట్ వాపసు తీసుకోనని తెగేసి చెప్పాడు. ఈ విచిత్ర ఘటన తెలంగాణలోని మెదక్‌ జిల్లా(Medak district) చిలప్‌చెడ్‌( chilapched )లో మంగళవారం వెలుగుచూసింది. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు సంగారెడ్డి జిల్లా జోగిపేట(Jogipeta)కు చెందిన 21 ఏళ్ల యువకుడు.. కాగా, రెండో వ్యక్తి చిలప్‌చెడ్‌ మండలం చండూర్‌కి చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవరు. వీరిద్దరికీ.. కొల్చారం మండలం దుంపలకుంటలోని ఓ కల్లు కాపౌండ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ నెల 1న ఫూటుగా తాగి.. ఆ మైకంలో చండూర్‌ యువకుడు తాళి కట్టగా.. జోగిపేట యువకుడు కట్టించుకున్నాడు. వ్యవహారం ముదరడంతో.. గ్రామపెద్దలు రంగంలోకి దిగారు. ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. చివరకు.. చండూర్‌ యువకుడి కుటుంబీకులతో రూ.10వేలు ఇప్పించడంతో ఈ విచిత్ర పెళ్లికి ఎండ్ కార్డు పడింది. జోగిపేట యువకుడు కంప్లైంట్ రిటన్  తీసుకున్నట్లు చిలప్‌చెడ్‌ ఠాణా ఎస్‌ఐ మహ్మద్‌గౌస్‌ తెలిపారు.

Also Read:  Viral Video: ఎక్కడా ప్లేస్ లేనట్టు ఈ పాము ఎక్కడ దూరిందో చూడండి…

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!