Viral Video: ఎక్కడా ప్లేస్ లేనట్టు ఈ పాము ఎక్కడ దూరిందో చూడండి…
ఇంటర్నెట్‌లో పాములకు సంబంధించిన వీడియోలు, వార్తలు రోజూ వైరల్ అవుతుంటాయి. వీటిపై నెటిజన్స్ బాగా ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటివారి కోసం తాజాగా ఓ వీడియో తీసుకువచ్చాం.
Snake Trending Video: ఇంటర్నెట్‌లో పాములకు సంబంధించిన వీడియోలు, వార్తలు రోజూ వైరల్ అవుతుంటాయి. వీటిపై నెటిజన్స్ బాగా ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటివారి కోసం తాజాగా ఓ వార్త తీసుకొచ్చాం. ఆస్ట్రేలియా( Australia)లోని ఓ కార్యాలయంలో టాయిలెట్ యూజ్ చేసేందకు వెళ్లిన ఉద్యోగి కంగుతిన్నాడు. ఎందుకంటే కమోడ్‌లో ఓ పాము కనిపించింది. దీంతో వెంటనే బయటకు వచ్చి.. హెర్వే బే స్నేక్ క్యాచర్స్(Hervey Bay Snake Catchers)కు సమాచారం ఇచ్చాడు. క్వీన్స్‌ల్యాండ్( Queensland)లోని ఫ్రేజర్ కోస్ట్ ప్రాంతంలోని ఒక పారిశ్రామిక ఎస్టేట్‌లో ఈ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. స్నేక్ క్యాచర్ డ్రూ గాడ్‌ఫ్రే ఆ పామును చౌకచక్యంగా పట్టుకున్నారు. క్వీన్స్‌ల్యాండ్ టాయిలెట్‌లలో సాధారణంగా కనిపించే పచ్చని కప్పలను తినడానికి ఇది టాయిలెట్ బౌల్‌లోకి వెళ్లి ఉండవచ్చని అని గాడ్‌ఫ్రే తెలిపాడు. వీడియోలో, గాడ్‌ఫ్రే టాయిలెట్‌లోకి వెళ్లి పామును బయటకు లాగడం చూడవచ్చు. “ఇది బాత్రూం లోపల మాత్రమే ఉందని నేను అనుకున్నాను. కానీ అది టాయిలెట్ బౌల్‌లోకి దూరింది. తప్పని పరిస్థితుల్లో ఆ బౌల్‌లో నా చేతిని పెట్టాల్సి వచ్చింది” అని గాడ్‌ఫ్రే సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
ఈ తరహా పాములు, ఆస్ట్రేలియాలోని ఉత్తర, తూర్పు తీరాలలో కనిపిస్తాయట. మధ్యస్థ-పరిమాణంలో ఉండి.. సుమారు ఐదు అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇవి పెద్దగా హాని చేసేవి కాదట. ఈ పాములు కప్పలు, బల్లులు, చిన్న క్షీరదాలను ఆహారంగా తింటాయి.
Also Read: Boda kakarakaya: బోడకాకర.. సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్.. ఎన్నో వ్యాధులకు చెక్…