AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: సర్పంచ్ సారూ ఇదేం పనండి.. చివరికి ముసుగు వేసుకోవాల్సి వచ్చిందిగా

రెండుసార్లు సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. పలువురుకి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ట్రాక్ తప్పాడు. అక్రమంగా సంపాదించేదుకు దొడ్డిదారిని ఎన్నుకున్నాడు. చివరికి అడ్డంగా బుక్కయ్యాడు.

AP: సర్పంచ్ సారూ ఇదేం పనండి.. చివరికి ముసుగు వేసుకోవాల్సి వచ్చిందిగా
Sarpanch Crime
Ram Naramaneni
|

Updated on: Apr 06, 2022 | 12:23 PM

Share

ఆయన ఓ సర్పంచ్..! ప్రజాప్రతినిధిగా ఉండి స్మగ్లర్ అవతారమెత్తాడు. ఏకంగా యూపీ స్మగ్లర్లతో నెట్వర్క్ పెట్టుకొని.. ఏవోబీ(AOB) నుంచి గంజాయిని తరలించేస్తున్నాడు. తాజాగా పుష్ప(Pushpa) స్టైల్లో లారిలో గంజాయిని తరలించేందుకు సహకరిస్తూ పట్టుబడ్డాడు.  ఒడిశా(Odisha) కోరాపుట్ జిల్లా( Koraput district) పాడువా పరిధిలోని గొల్లూరు గ్రామానికి చెందిన శుభాష్ చంద్ర.. రెండుసార్లు సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. దీన్నే ఆసరాగా చేసుకుని గంజాయి బిజినెస్ పై దృష్టి సారించాడు. గిరిజన రైతులకు మభ్యపెట్టి.. గంజాయి మాఫియాతో చేతులు కలిపాడు. ఇక నెట్ వర్క్ ను యూపీ వరకు పెంచి దందా సాగించేస్తున్నాడు.

అలా దొరికాడు..!

–  అల్లూరి జిల్లా అరకులోయ మండలం పద్మాపురం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమాన్నాస్పదంగా లారీ కనిపించింది. పాడువకు బంగాళ దుంపలు తీసుకెళ్లి.. అన్‌లోడ్ చేసి తిరిగివస్తోంది. ఆ లారీని ఆపి తనిఖీ చేశారు పోలీసులు. లారీ అంతా వెతికారు. అయినా ఎక్కడా ఏమి కనిపించలేదు. అయినా.. పోలీసులకు అనుమానం..! దీంతో మరోసారి క్షుణ్ణంగా వెరిఫై చేశారు. అప్పుడు.. డ్రైవర్ వెనక భాగంలో క్యాబిన్ కు, వెనుక తొట్టికి మధ్య క్యాబిన్ లో  ఓ రహస్య అర ఉన్నట్టు గుర్తించ్చారు. పుష్ప సినీ స్టైల్లో ఉన్న ఆ అరలో చెక్ చేయగా అందులో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 680 కేజీల గంజాయిని గుర్తించారు.

ఒడిషాలోని పాడువా నుంచి జార్ఖండ్ కు లారీలో గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. లారిలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేసరికి ఒడిశాలోని గొల్లూరు గ్రామానికి చెందిన శుభాష్ చంద్ర పేరు బయటకు వఛ్చింది. ఆయనే అక్కడి సర్పంచ్. రాజస్థాన్‌కు చెందిన విక్రమ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనుతో పాటు గొల్లూరు సర్పంచ్ శుభాష్ చంద్రలను అరెస్ట్ చేసి విచారించేసరికి యూపీ లింక్ బయటపడింది. సర్పంచ్ శుభాష్ చంద్ర.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పంకజ్ తో చేతులు కలిపాడు. తరచూ కూరగాయల లోడ్ లారీ మాటున.. శుభాష్ చంద్ర సహకారంతో యూపీకి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు పంకజ్.  ఏవోబిలోని గిరిరైతులకు మభ్యపెట్టి వారి ద్వారా గంజాయి తరలించేదుకు అన్నివిధాలా సర్పంచ్ శుభాష్ చంద్ర సహకరించాడని  అరకు సిఐ జీడి బాబు తెలిపారు.

– ఇదీ..!  ఒడిశా సర్పంచ్ గంజాయి దందా. ఇటువంటి వారి మాటల్లో పడి గిరిజనులు జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.

ఖాజా, వైజాగ్

Also Read: Telangana: మందు ఎక్కువైంది.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే..