How to Murder Your Husband: “భర్తను ఎలా చంపాలో” నవల రాసింది.. ఏకంగా తానే ఆచరించి చూపించింది?
రొమాంటిక్ నవలలు రాసిన ప్రముఖ రచయితలు ఎందరో ఉన్నారు. అందులో నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ ఒకటి. నాన్సీ తన సొంత భర్త హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.
How to Murder Your Husband: రొమాంటిక్ నవలలు రాసిన ప్రముఖ రచయితలు ఎందరో ఉన్నారు. అందులో నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ(Nancy Crampton Brophy) ఒకరు. నాన్సీ తన సొంత భర్త హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆసక్తికర విషయం ఎమంటే..? తన భర్త హత్యకు కొన్ని సంవత్సరాల ముందు, నాన్సీ ‘హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్’ అనే శీర్షికతో ఒక కథనాన్ని రాశారు. ఇదే ఇప్పడు చర్చీనీయాంశంగా మారింది. యాదృచ్ఛికంగా, నాన్సీ ఇప్పుడు తన సొంత భర్తను హత్య చేసిన ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఆమె భర్త డేనియల్ బ్రోఫీ రక్తంతో తడిసిన మృతదేహం అమెరికా(America) పోర్ట్‌ల్యాండ్‌లోని క్యులినరీ ఇన్‌స్టిట్యూట్‌లో గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి అతని ఛాతీపై వీపుపై కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు.
కోర్టులో పోలీసులు సమర్పించిన చార్జీషీట్ ప్రకారం, జూన్ 2, 2018 న, డేనియల్ బ్రోఫీ దారుణ హత్యకు గురయ్యాడు. అతన్ని అత్యంత కిరాతకంగా తుపాకీతో కాల్చి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనామానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డేనియల్ హత్యకు గురైన రోజు అతని భార్య నాన్సీ పోర్ట్‌ల్యాండ్‌లో ఉన్నట్లు వెల్లడైంది. అయితే రోజంతా తన ఇంట్లోనే ఉన్నానని నాన్సీ తన ప్రకటనలో అబద్ధం చెప్పినట్లు పోలీసులు తేల్చేశారు. నాన్సీకి చెందిన మినీ వ్యాన్ కూడా నేరం జరిగిన ప్రదేశం చుట్టూ కనిపించిందని నేర పరిశోధనలో తేలింది. ఇదంతా కూడా ట్రాఫిక్ పోలీసుల సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. నాన్సీకి ఈ నేరంతో సంబంధం ఉందని.. పోలీసులు అనుమానించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కాగా, నాన్సీ తన భర్త హత్య వార్తను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు. ‘నా భర్త ఎవరో చంపారు. ఏం చేయాలో తెలియడం లేదు.’ అంటూ రాశారు. అయితే దీని తరువాత, సెప్టెంబర్ 2018 లో ఆమెపై అనుమానం ఆధారంగా నాన్సీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, నాన్సీ తాను నిర్దోషి అని చెబుతూనే ఉంది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని నాన్సీ చెబుతున్నారు. ఇదిలావుంటే, కరోనా మహమ్మారి కారణంగా ఈ కేసు విచారణ రెండేళ్లపాటు వాయిదా పడింది. గత సోమవారం నుంచి విచారణ ప్రారంభమైంది. నాన్సీ ఇప్పుడు తన భర్తను చంపడానికి కారణం ఏమిటో సమాధానం ఇంత వరకు చెప్పలేదు. డేనియల్ కుటుంబానికి తన హంతకుడు ఎవరో తెలిసేలా అతను మిలియన్ డాలర్ల బీమా కోసం ఇలా చేశాడా? నాన్సీ తన భర్తను చంపడమే కాకుండా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, పోలీసుల వాదనలపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదీ ఉత్కంఠగా మారింది.
Read Also…. Nandyala: చిన్న కాకి, పెద్ద నష్టం మిగిల్చింది.. ఆ కథా కమామిషు మీ కోసం…