Hyderabad: మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి.. కారణం అదేనా..?
Hyderabad ESI Metro Station: హైదరాబాద్ నగరంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పై నుంచి ఓ యువతి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది.
Hyderabad ESI Metro Station: హైదరాబాద్ నగరంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పై నుంచి ఓ యువతి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ప్రేమ విఫలమే కారణమని పేర్కొంటున్నారు. ఈ ఘటన కలకలం రేపింది. ఎస్సార్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ శ్రీరామ్‌నగర్ సమీపంలోని సంజయ్ నగర్‌కు చెందిన అన్వర్‌ఖాన్ ఆటో మొబైల్ దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, కూతురు షబ్నం బేగం (22) ఉంది. షబ్నం ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా షబ్నం బేగం ఎవరితోనో చాటింగ్ చేస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు.
దీంతో.. మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్‌కు చేరుకొని మొదటి అంతస్తు పైకి ఎక్కింది. అనంతరం కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: