Viral Video: వామ్మో.. పిల్లలతో కలిసి స్విమ్మింగ్ చేసిన ఫైథాన్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..
Giant python swim with little kids: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.
Giant python swim with little kids: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఉంటాయి. తాజాగా.. ఓ పాముకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా పాములను చూడగానే ప్రజలు పరుగులు తీస్తుంటారు. అయితే.. అన్ని రకాల పాములకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో వేలాది జాతుల పాములు ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని మాత్రమే విషపూరితమైనవి ప్రమాదకరమైనవి. కింగ్ కోబ్రా, క్రైట్ మొదలైనవి చాలా విషపూరితమైనవి. ఈ పాములకు దూరంగా ఉండటం మంచిది. కొండచిలువలు విషపూరితం కాకపోయినా.. ప్రమాదకరమైనవి. ఎందుకంటే.. చుట్టుముట్టి మరి చంపుతాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పెద్ద కొండచిలువ వీడియో ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వైరల్ వీడియోలో.. ప్రమాదకరమైన భారీ కొండచిలువతో కలిసి చిన్న పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. స్విమ్మింగ్ పూల్‌లో కొందరు పిల్లలు సరదాగా ఈతకొడుతుండగా.. వారి మధ్య నీటిలో ఓ పెద్ద కొండచిలువ ఈత కొడుతున్న దృశ్యాలను వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో కొంతమంది పిల్లలు దాన్ని తాకడానికి కూడా ప్రయత్నిస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పిల్లలు తమ ఎదురుగా పాము ఉందని.. అది చాలా పెద్దదని ఏమాత్రం భయపడకుండా సరదాగా స్నానం చేస్తూ దానితో ఆడుకుంటున్నారు. కాగా, విదేశాల్లో కూడా చాలా మంది కొండచిలువలను పెంచుకుంటుంటారు. అయితే.. నీటిలో ఉన్న ఈ కొండచిలువ కూడా పెంపుడు పాముగా కనిపిస్తోంది.
వైరల్ వీడియో..
View this post on Instagram
ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో rhmsuwaidi అనే యూజర్ షేర్ చేశారు. కేవలం 13 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 59 వేలకు పైగా వీక్షణలు రాగా.. వేలాది మంది లైక్ చేశారు. అదే సమయంలో పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. పాములతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.
Also Read: